ఏం జరుగుతోంది : మోడీకి వచ్చిన కాగితం ఏంటీ.. మధ్యలోనే ఎందుకెళ్లారు

  • Publish Date - February 27, 2019 / 08:32 AM IST

ఏం జరుగుతోంది.. ఏం జరగబోతున్నది.. దేశంలో కమ్మేసిన యుద్ధ మేఘాలతో అందరిలో ఒకటే టెన్షన్. ఉత్కంఠ. భారత్ – పాక్ మధ్య యుద్ధ విమానాలు కూల్చివేసే స్థాయికి సిట్యువేషన్ వెళ్లిపోయింది. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ సమక్షంలో విజ్ణాన్ భవన్‌లోని నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ 2019 కార్యక్రమంలో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాల్గొన్నారు. యువకులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెబుతున్నారు.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

ఇదే టైంలో మోడీకి ఓ కాగితం వచ్చింది. దాన్ని చదువుకున్న ఆయన వెంటనే.. మిగతా అతిధుల దగ్గరకు వెళ్లారు. బాయ్.. బాయ్ అని చెప్పారు. తన చేతికి వచ్చిన కాగితాన్ని వ్యక్తిగత భద్రత సిబ్బందికి అందించి.. హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కాగితం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. లేకపోతే అంత హడావిడిగా ఎందుకు వెళతారు అని అందరూ అనుకోవటం కనిపించింది. మోడీకి అందిన కాగితంలో ఏదో సీరియస్ మేటర్ ఉందనే చర్చ జరుగుతుంది. ఏదో జరుగుతుంది.. ఏదో జరగబోతున్నది అనుకుంటున్నారు.
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్‌ యుద్ధ విమానం బాంబులు వేయటం, ఆ తర్వాత భారత్ ఆ యుద్ధ విమానాన్ని వెంటాడటం జరిగిపోయాయి. ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్ లో భారత మిగ్ విమానం ఒకటి కూలిపోయింది. ఈ పరిణామాల క్రమంలోనే ఆయనకు కాగితం అందిందని.. అందుకే అత్యవసరంగా వెళ్లిపోయారు అంటున్నారు. విజ్ణాన్ భవన్ నుంచి నేరుగా భద్రతా అధికారుల అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరయ్యారు ప్రధాని మోడీ.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్