Aircraft carrier INS Vikrant: ప్రధాని మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్

 ప్రధాని మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్ చేరింది. భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​-విక్రాంత్‌ పేరుతో ఈ యుద్దనౌకకు పేరు పెట్టారు. బాహుబలి నౌకగా పేరు గాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు ఉంటుంది. గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌ మైళ్ళ వేగం (51.8 కిలోమీటర్ల వేగం)తో ఈ నౌక ప్రయాణిస్తుంది. దీనిపై 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను పెట్టి తీసుకెళ్ళవచ్చు.

Aircraft carrier INS Vikrant

Aircraft carrier INS Vikrant: ప్రధాని మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్ చేరింది. భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​-విక్రాంత్‌ పేరుతో ఈ యుద్దనౌకకు పేరు పెట్టారు. బాహుబలి నౌకగా పేరు గాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు ఉంటుంది. గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌ మైళ్ళ వేగం (51.8 కిలోమీటర్ల వేగం)తో ఈ నౌక ప్రయాణిస్తుంది. దీనిపై 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను పెట్టి తీసుకెళ్ళవచ్చు.

ఈ నౌక 45 వేల టన్నుల బరులు ఉంటుంది. ఈ యుద్ధ నౌకలో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. యుద్ధ సమయంలో గాయపడే వారికి ఈ నౌక చికిత్స అందించవచ్చు. 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని ఇందులో నిర్మించారు. ఈ నౌకలో 2 ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్ లు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌ మెషీన్ ఉన్నాయి. ఇందులో ఐదుగురు వైద్య అధికారులతో పాటు 15 మంది ఆరోగ్య సిబ్బంది ఉంటారు.

ఈ నౌక లోపల 2,300 కంపార్ట్‌మెంట్లను నిర్మించారు. ఈ యుద్ధ నౌక తయారీ 2005లో కేరళలోని కొచ్చి షిప్‌ యార్డ్‌లో ప్రారంభమైంది. ఈ యుద్ధ నౌక తయారీలో స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా, బీహెచ్​ఈఎల్​ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే, ప్రైవేటు సంస్థ ఎల్‌అండ్‌టీ, ఇతర సంస్థలు పాలుపంచుకున్నాయి.

Britan pm in inida : బ్రిటన్ ప్రధాని భారత్ పర్యటన అందుకేనా..?బోరిస్ బుజ్జగింపులు ఫలిస్తాయా?