PM-Kisan Scheme: రైతులకు మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. ‘పీఎం-కిసాన్’ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM-Kisan Scheme) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- July 31, 2026 / 07:16 PM IST
modi govt key decision on pm kisan scheme to extended for 5 years till 2031
- పీఎం కిసాన్ మరో ఐదేళ్లు
- మూడు లక్షల కోట్లకు ఆమోదం
- రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు
PM-Kisan Scheme: దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత ఆదరణ పొందిన ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో కోట్లాది మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
రూ.3.15 లక్షల కోట్లతో ఐదేళ్ల పొడిగింపు:
పీఎం-కిసాన్ (PM-Kisan Scheme)పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఐదేళ్ల కాలానికి గానూ రూ.3,15,614 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దీనివల్ల అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున (మూడు విడతల్లో రూ.2,000) నేరుగా డీబీటీ పద్ధతిలో బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. పంట పెట్టుబడి సమయంలో ఈ డబ్బులు అందడం వల్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోతోందని నీతి ఆయోగ్ అధ్యయనం స్పష్టం చేసింది.
23వ విడత విడుదల, కీలక నిర్ణయాలు:
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 23 విడతల్లో మొత్తం రూ.4.47 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఇదే సమావేశంలో కేబినెట్ ‘సముద్ర మంథన్’ అనే జాతీయ ఆఫ్‌షోర్ అన్వేషణ పథకానికి రూ.84,084 కోట్లను ఆమోదించింది. ఐదేళ్ల పొడిగింపు నిర్ణయం భారత వ్యవసాయ రంగానికి సరికొత్త ఊతాన్నిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.
