Subramanya Swamy : ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు,ఆర్థిక మంత్రికి ఏమీ తెలీదు..అందుకే ఇలా..: సుబ్రహ్మణ్యస్వామి

ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు. మోదీ పేరు చెప్పకుండానే నేను ఎంపీనయ్యా..

Subramanya Swamy

Subramanya Swamy : బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆర్థిక శాస్త్రంలో నిరక్షరాస్యుడు అంటూ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీపై స్వామి స్పందిస్తు.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రతీ సంవత్సరం జీబీపీలో 10శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని..దీంతో కేవలం 10 ఏళ్లలోనే దేశంలో నిరుద్యోగ సమస్యను, , పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని అన్నారు.

కానీ మోదీ ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు…మరోవైపు ఆర్థిక విధానలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏం చేయాలో తెలియదన్నట్లుగా అందుకే దేశంలో ఇలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతపార్టీపైనే స్వామి పెట్టిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Nitin Gadkari: కాంగ్రెస్ పార్టీలో చేరికపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా సుబ్రమ్మణ్యస్వామి సొంతపార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదేమీ మొదటిసారికాదు. గతంలో కూడా పలుమార్లు చేశారు. ఇటీవల మోడీ ఫ్యాన్స్ గురించి ట్వీట్ చేస్తు తాను మోదీ పేరు చెప్పకుండానే ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచి ఎంపీనయ్యాను అంటూ వ్యాఖ్యానించారు.