భారత ఆర్మీని మోడీ సేన గా అభివర్ణిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఈసీ ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఘజియాబాద్ లో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ…ఉగ్రవాదులకు కాంగ్రెస్ నాయకులు బిర్యానీ పెట్టారు,మోడీ సేన మాత్రం బుల్లెట్లు,బాంబులు పెట్టిందని యోగి అన్నారు.కాంగ్రెస్ కు అసాధ్యమైనది మోడీకి సాధ్యమైందని అన్నారు.యోగి మోడీ సేన వ్యాఖ్యలపై పలు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.ఆర్మీని బీజేపీ అవమానించిందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.వెంటనే యోగి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.