×
Ad

మోదీ, పుతిన్‌ ప్రెస్‌ మీట్‌ హైలైట్స్‌.. 2030 వరకు ఈ ప్రోగ్రాన్ని కొనసాగించేందుకు అంగీకారం.. ఉగ్రవాదంపై కీలక కామెంట్స్‌..

మనకు రష్యా చాలా కాలం నుంచి మిత్రదేశమని చెప్పారు.

Modi: భారత్‌, రష్యా మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు.

మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇవాళ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. మనకు రష్యా చాలా కాలం నుంచి మిత్రదేశమని చెప్పారు. భారత్‌, రష్యా ద్వైపాక్షిక సత్సంబంధాలు మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు.

Also Read: తమిళనాడు ఎన్నికల ముందు అగ్గి రాజేస్తోన్న “కార్తీక దీపం” ఇష్యూ.. ఈ వివాదానికి వందేళ్లకు పైగా చరిత్ర  

ఇండియా-రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. 2030 వరకు ఇరు దేశాల మధ్య వ్యాపారాలను మరింత విస్తరించేందుకు ఆర్థిక సహకార ప్రోగ్రాన్ని కొనసాగించడానికి ఇండియా-రష్యా అంగీకరించాయని అన్నారు.

పుతిన్‌ అందిస్తున్న సహకారాన్ని మోదీ కొనియాడారు. “2010లో మన భాగస్వామ్యానికి స్పెషల్ ప్రివిలిజ్డ్ స్ట్రాటెజిక్ పార్ట్నర్‌షిప్ హోదా ఇచ్చారు. గత రెండున్నర దశాబ్దాలుగా పుతిన్ ఈ సంబంధాన్ని తన నాయకత్వం, విజన్‌తో పెంచారు. ప్రతి పరిస్థితిలోనూ ఆయన నాయకత్వం మన స్నేహ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇండియాతో ఆయన కొనసాగిస్తున్న ఈ స్నేహం, నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గత 8 దశాబ్దాల్లో ప్రపంచం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. మానవజాతి అనేక సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంది. ఇలాంటి సమయంలోనూ భారత్-రష్యా స్నేహం ఓ ధ్రువతారలా స్థిరంగా ఉంది” అని అన్నారు.

‘‘ఉగ్రవాదంపై పోరులో భారత్, రష్యా చాలా కాలంగా ఒకేతాటిపై నడుస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి, క్రోకస్ సిటీ హాల్‌పై పిరికిపందలు చేసిన దాడి.. ఇలా ఏదైనా ఈ ఘటనలన్నింటికీ మూలం ఒక్కటే.. ఉగ్రవాదం అంటే మానవతా విలువలపై చేస్తున్న ప్రత్యక్ష దాడే అని భారత్ నమ్ముతోంది. బ్రిక్స్‌, ఎస్‌సీవో, ఇతర ఫోరమ్‌లన్నింటిలో మేము సహకారాన్ని కొనసాగిస్తాము” అని తెలిపారు.

మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పుతిన్ అన్నారు. భారత్‌తో కీలక ఒప్పందాలపై చర్చలు జరిగాయని చెప్పారు. ఇరు దేశాల స్నేహ బంధానికి చారిత్రక నేపథ్యం ఉందని అన్నారు.