Modi to interact with street vendors వీధి వ్యాపారులతో మాట్లాడేందుకు మోడీ సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను గట్టెక్కించేందుకు కేంద్రం.. జూన్-1న పీఎం స్వానిధి పథకం (పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి)ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఉత్తరప్రదేశ్లోని పీఎం స్వానిధి లబ్ధిదారులతో మంగళవారం ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు.
కాగా, ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తం 24 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు ఆదివారం ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ప్రకటించింది. ఇందులో 12 లక్షల వీధి వ్యాపారులకు ఇప్పటికే రుణాలు మంజూరైనట్లు తెలిపింది. 5.35 లక్షల మందికి రుణాలు పంపిణీ కూడా అయినట్లు వివరించింది. ఒక్క ఉత్తర్ప్రదేశ్ నుంచే 6 లక్షల దరఖాస్తులు రాగా అందులో 3.27 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు…1.87 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేసినట్లు PMO తెలిపింది.