Modi Twitter account personal website హ్యాక్

  • Publish Date - September 3, 2020 / 10:10 AM IST

ప్రధాని నరేంద్రమోదీ పర్సనల్ వెబ్‌సైట్‌ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది. కొందరు హ్యాకర్లు ఆయన అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ కూడా నిర్థారించింది. గురువారం తెల్లవారుజాము హ్యాకింగ్ కు గురైనట్లు గుర్తించారు. ప్రధాని రిలీఫ్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇవ్వాలని హ్యాకర్లు ఇందులో మెసేజ్ పెట్టారు.



క్రిఫ్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయాలని సూచించారు. అంతేకాదు ఏ అకౌంట్‌కు చెల్లింపులు చేయాలో కూడా ఇందులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ట్విట్టర్‌ పేర్కొంది. ఇతర అకౌంట్లేవీ హ్యాక్‌కు గురికాలేదని తెలిపింది. ఇటీవలే బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, ఎలాన్‌ మస్క్‌ వంటి ప్రముఖుల అకౌంట్లపై కూడా హ్యాకర్లు తమ ప్రతిభను ప్రదర్శించారు.

బిట్‌కాయిన్‌ ప్రమోషన్‌కు దాన్ని వాడుకున్నారు. అయితే అందులో మీరు నాకు వెయ్యి డాలర్లు పంపితే మీకు 2వేల డాలర్లు పంపుతానని ఆశ చూపారు. ఈ అవకాశం అరగంట మాత్రమే అంటూ ఊరించారు.



పీఎం నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్‌తో ధృవీకరించబడిన ట్విట్టర్ ఖాతాలో 2.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గతంలోనూ ఖాతాను హ్యాక్ చేసి.. క్రిప్టోకరెన్సీ ద్వారా ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వమని వరుస ట్వీట్లు పెట్టారు.

అప్పటి నుంచి అదే తీసివేయబడింది. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రముఖుల, దిగ్గజ సంస్థల ఖాతాలు ఈ ఏడాది హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు