కైసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ) అనే వైరల్ ఫీవర్ కర్ణాటకలోని షిమోగా జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మంకీ ఫీవర్‌గా భావిస్తున్న ఈ వైరల్ జబ్బు ఎక్కడ అంటుకుంటుందోనని శివంమొగ్గ ప్రాంతంలోని స్థానికులతో పాటు వైద్యులు కూడా భయాందోళనలకు గురి అవుతున్నారు.
కైసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ) అనే వైరల్ ఫీవర్ కర్ణాటకలోని షిమోగా జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మంకీ ఫీవర్‌గా భావిస్తున్న ఈ వైరల్ జబ్బు ఎక్కడ అంటుకుంటుందోనని శివంమొగ్గ ప్రాంతంలోని స్థానికులతో పాటు వైద్యులు కూడా భయాందోళనలకు గురి అవుతున్నారు. ఉడిపి జిల్లాలోనూ వ్యాధి లక్షణాలు కనిపించడంతో వైద్య బృందమంతా అప్రమత్తమైయ్యారు.
ఇప్పటికే ఈ జబ్బు ముదిరి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 400 మందికి పైగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని కైసనూర్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న కోతుల నుంచి ఇది వ్యాపిస్తుండటంతో నివారణ చర్యలు ముమ్మరం చేశారు. అడవులలోని కోతులు వరుసగా మరణిస్తుండటంతో విషయంపై దృష్టి సారించారు. చికిత్స కోసం చేసిన పరిశోధనల్లో సరైన మందు దొరకకపోవడంతో జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వ్యాధి వ్యాప్తి ఉన్న ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కోతుల నుంచి మనుషులకు టిక్(పురుగు)లు కుట్టడం ద్వారా, జంతువుల స్పర్శ ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదముంది. అంతేకానీ, మనిషి నుంచి మనిషికి మాత్రం సోకకపోవడం ఓ మంచి విషయం.
వ్యాధి లక్షణాలు:
వారం నుంచి రెండు వారల్లో లక్షణాలు కనిపించిన రోగులు సాధారణ వైద్యం ద్వారా కోలుకుంటారు. రెండు రకాలుగా కనిపిస్తున్న ఈ జబ్బు ముదిరి మరణించేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే. మూడో వారం కూడా అదే లక్షణాలు కొనసాగితే మాత్రం.. కింద లక్షణాలతో బాధపడాల్సి వస్తుంది.
నివారణ చర్యలు:
లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడ్ని సంప్రదించాలి. రక్తకణాలు తగ్గిపోవడం, రక్తస్రావం నుంచి బయటపడగలం.
జాగ్రత్తలు:
వ్యాధి తీవ్రత ఉన్న ప్రదేశాల్లో సంచరించే వారు శరీరం పూర్తిగా కప్పి ఉండే విధంగా దుస్తులు ధరించాలి. కీటకాలు, దోమలు సంచరించే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. వ్యాధి రాకుండా చూసుకోవడమే ఉత్తమం. సరైన చికిత్స కనుగొనకపోవడంతో జాగ్రత్తలు పాటించడమే శ్రేయస్కరం.