Monkey
Monkey Returns Man’s Glasses : ఎవరైనా ఆకతాయి, అల్లరి పనులు చేస్తుంటే ఏంట్రా ఆనులు కోతి చేష్టల్లాగా ? అని అంటుంటాం. ఎందుకంటే..కోతి పనులు అలా ఉంటాయి కనుక. చేతుల్లో ఉన్నవి, ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్..ఇతరత్రా ఎత్తుకెళ్లి..చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఎత్తుకెళ్లిన వస్తువులు విలువైనవి అయితే..వాటి గురించి మరిచిపో..ఇక అంతే సంగతులు అంటుంటారు. ఎందుకంటే..అవి ఎత్తుకెళ్లినవి..తిరిగి ఇవ్వవు.. అయితే..ఓ కోతి మాత్రం ఎత్తుకెళ్లిన వస్తువు మాత్రం ఎంచక్కా ఇచ్చేసింది. అయితే…ఓ ఫుడ్ ఐటమ్ తీసుకున్న తర్వాత..తిరిగి ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Read More : Amit Shah Mission 2022 : యూపీపై షా ఫోకస్, మిషన్ 2022 బ్లూ ప్రింట్ ఫైనలైజ్!
ఐపీఎస్ ఆఫీసర్ రూపిన శర్మ కళ్లద్దాలను ఓ కోతి ఎత్తుకెళ్లింది. అనంతరం బిల్డింగ్ పక్కనే చెట్లకు ఏర్పాటు చేసిన స్టాండ్ పై కూర్చొంది. దాని పక్కనే మరో కోతి కూడా ఉంది. దాని చేతిలో ఉన్న కళ్ల జోడును ఎలాగైనా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎలా ? అని ఆలోచించారు. వెంటనే ఓ ఐడియా తట్టింది. ఓ ఫుడ్ ప్యాక్ ను తీసుకొచ్చి..కోతి ముందు ఉంచి…అది ఇచ్చేయ్ అంటారు. అమాంతం అది ఆ ప్యాక్ పట్టుకోవడానికి ప్రయత్నించగా…రూపిన శర్మ ఫుడ్ ప్యాకెట్ ను వెనక్కి లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో అది కళ్లజోడు ఇవ్వడానికి నో చెప్పింది.
Read More : Huzurabad By Poll : హుజూరాబాద్ ఉపఎన్నిక రద్దు కోసం కాంగ్రెస్ నేతల యత్నాలు
సరే ఇస్తాను తీసుకో..కళ్లజోడు మాత్రం ఇచ్చేయ్ అంటారు. ఆ ప్యాక్ తీసుకున్న అనంతరం కళ్లజోడును కిందకు విసేరిసింది కోతి. కానీ..ఆ కళ్లజోడు స్టాండ్ లో ఇరుక్కపోతుంది. అయినా..కూడా దానిని బయటకు తీసి..కిందకు విసిరేసింది. Rupin Sharma IPS పేరిట ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను ట్వీట్ చేశారు. కోతి స్మార్ట్ అని పేర్కొంటూ..ఏక్ హాత్ దో, ఏక్ హాత్ లో (ఒక చేత్తో తీసకుంటూ ఇంకో చేత్తో ఇచ్చింది) అంటూ క్యాప్షన్ పెట్టారు. 2021, అక్టోబర్ 28వ తేదీన ట్విట్టర్ లో పోస్టు చేయగా..తెగ వైరల్ గా మారింది.
Smart ???
Ek haath do,
Ek haath lo ????? pic.twitter.com/JHNnYUkDEw— Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021