Parliament Monsoon Sessions : ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. జులై19 నుంచి ఆగస్టు 13వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

Parliament Mansoon Session

Parliament Monsoon Sessions : ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. జులై19 నుంచి ఆగస్టు 13వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ రెండు తేదీల మధ్య మొత్తం 19 పనిదినాల్లో ఉభయ సభలు జరుగుతాయని ఆయన అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను స్పీకర్  ఈ రోజు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చే ఎంపీలు, మీడియా ప్రతినిధులు అందరినీ పార్లమెంట్ లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పని సరికాదని ఆయన తెలిపారు.

అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం వ్యాక్సిన్   వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ప్రతిరోజు ఉదయం 11గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు సాగుతాయని ఓంబిర్లా చెప్పారు.