Moradabad Doctor : 25ఏళ్ల నాటి ఆ ఘటన.. తన యావదాస్తినే విరాళంగా ఇచ్చేశాడు.. ఎందుకో తెలుసా?

అతడు దానాల్లో ధర్మరాజు కంటే గొప్పవాడు.. ఎంతంటే.. తన యావదాస్తిని సైతం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప వైద్యుడు. కరోనా కష్టకాలంలోనూ ఇబ్బందులు పడే వ్యక్తులతో అందరిలా చూస్తూ ఊరుకోలేదు అతడు.

Moradabad Doctor Donates Property Worth Rs 600 Crore To Up Government

Moradabad Doctor : అతడు దానాల్లో ధర్మరాజు కంటే గొప్పవాడు.. ఎంతంటే.. తన యావదాస్తిని సైతం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప వైద్యుడు. కరోనా కష్టకాలంలోనూ ఇబ్బందులు పడే వ్యక్తులతో అందరిలా చూస్తూ ఊరుకోలేదు అతడు. వేలాది మంది తన వంతు సాయం చేశాడు. ఉచిత వైద్యాన్ని అందిస్తూ అన్నిరకాలుగా వసతులను ఏర్పాటు చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. అతడు ఎవరో కాదు.. మొరదబాద్‌కు చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్. గత 50ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నాడు. తన ఇంటిని మాత్రమే ఉంచుకుని సుమారుగా రూ. 600 కోట్ల విలువ చేసే ఆస్తిని యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు.

ఆస్తి మొత్తాన్ని నిరుపేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం వెచ్చించాల్సిందిగా ప్రభుత్వానికి గోయల్ సూచించారు. వాస్తవానికి తాను 25 ఏళ్ల కిందటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని వైద్యుడు గోయల్‌ వెల్లడించారు. ఇప్పటికే గోయల్‌ 100కు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు. గోయల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెబితే తన కుటుంబసభ్యులు కూడా సపోర్టు ఇచ్చారని తెలిపాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మొరదాబాద్‌ పరిధిలోని 50 గ్రామాలను దత్తత తీసుకున్నాడు. అలాగే అక్కడ అవసరమైన అన్ని రకాల వసతులను అందించాడు. ఉచిత విద్యను అందించాడు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాడు. తాను చేసిన సేవలకుగాను రాష్ట్రపతుల చేతులమీదుగా అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు.

Moradabad Doctor Donates Property Worth Rs 600 Crore To Up Government

25 ఏళ్ల క్రితం ఒక సంఘటనే తన జీవితాన్ని మార్చేసిందని గోయల్ చెప్పుకొచ్చాడు. తాను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో వ్యక్తి నాకు ఎదురుగా కూర్చున్నాడని చెప్పాడు. ఒక వైపు వణుకుపుట్టించే చలి.. ఒంటిపైన కప్పుకోవడానికి అతడికి ఏమి లేవు. కాళ్లకు చెప్పులు కూడా లేదని గ్రహించానని చెప్పాడు. వెంటనే చలించిపోయి తనకు చేతనైన సాయం చేసినట్టు తెలిపాడు. ఇప్పటికీ అది తన మనసులో అలాగే ఉండిపోయిందని తెలిపాడు. ఒక్కరికి సాయం చేసినా.. దేశంలో ఇలాంటి వాళ్లు ఎంతో మంది ఉంటారని అనిపించిందని తెలిపాడు. వాళ్లందరి సైతం తనవంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నాని గోయల్ పేర్కొన్నారు.

Read Also : OnePlus 10T 5G : అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?