కొవిడ్ – 19 టీకా వల్ల అతను చనిపోలేదు – వైద్యులు

Moradabad man dies : కొవిడ్ – 19 టీకా తీసుకున్న మరుసటి రోజు ఓ వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది. కానీ..అతను టీకా వల్ల చనిపోలేదని, ఇతరత్రా కారణాల వల్ల మృతి చెందాడని వైద్యులు వెల్లడిస్తున్నారు. అతను ఎలా చనిపోయాడనే దానిపై పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుందని ఉత్తర్ ప్రదేవ్ సీఎంఓ వెల్లడించింది. మొరదాబాద్ లోని జిల్లా ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిపాల్ సింగ్డా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.

ఒకరోజు తర్వాత..చనిపోయాడు. శనివారం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత..అసౌకర్యానికి గురయ్యాడు. రాత్రి విధులకు హాజరైన తర్వాత..ఛాతిలో అసౌకర్యంగా ఉండడం..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మరుసటి రోజు ఉదయం అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే..అతను చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకోకముందే..అనారోగ్యంతో ఉన్నారని, టీకా తీసుకున్న అనంతరం పరిస్థితి విషమించిందని మహీపాల్ కుటుంబసభ్యులు వెల్లడించారు.

మృతదేహానికి ముగ్గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.cardiogenic shock/septicemic shock, cardio-pulmonary disease తో చనిపోయాడని, కరోనా వ్యాక్సిన్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. మహీపాల్ గుండె వ్యాపించి ఉందని, రక్తం గడ్డకట్టిందని, అంతేగాకుండా..అతను గుండె జబ్బుతో బాధ పడుతున్నట్లు తెలుస్తోందని Chief Medical Officer మిలింద్ చంద్రగార్గ్ తెలిపారు.

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత..దేశ రాజధాని ఢిల్లీలో 51 మంది అస్వస్థతకు గురయ్యారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. 22 ఏళ్ల వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో..ఎయిమ్స్ కు తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇతరులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి..పరిశీలించారని, 30 నిమిషాల అనంతరం డిశ్చార్జ్ చేశామన్నారు. కోల్ కతాలో శనివారం కొవిడ్ – 19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత..35 ఏళ్ల నర్సు సృహ కోల్పోవడంతో క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో చేర్పించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు