Indian Citizenship : భారత పౌరసత్వం కోసం పాక్ నుంచి భారీగా దరఖాస్తులు!

అప్ఘానిస్తాన్‌, పాక్, బంగ్లాదేశ్‌కు చెందిన 3,177మందికి గడిచిన నాలుగేళ్లలో భారత పౌరసత్వం అందిచినట్లు

India

Indian Citizenship :  అప్ఘానిస్తాన్‌, పాక్, బంగ్లాదేశ్‌కు చెందిన 3,177మందికి గడిచిన నాలుగేళ్లలో భారత పౌరసత్వం అందిచినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం ప్రకటించారు.

భారత పౌరసత్వం కోసం ప్రస్తుత దరఖాస్తుదారులు మరియు గత ఐదేళ్లలో భారత పౌరసత్వం పొందిన వారి వివరాల గురించి ఎంపీ అబ్దుల్ వహాబ్ అడిగిన ప్రశ్నకు రాయ్ స్పందిస్తూ… డిసెంబర్ 14, 2021 వరకు భారత పౌరసత్వం కోసం 10,635 మంది దరఖాస్తు చేసుకున్నారని,ఇందులో 70శాతం అంటే 7,306 మంది పాకిస్తాన్‌కు చెందిన వారని చెప్పారు.

అఫ్ఘానిస్తాన్‌ నుంచి 1,152, అమెరికా నుంచి 428, శ్రీలంక నుంచి 223, నేపాల్ నుంచి 189, బంగ్లాదేశ్ నుంచి 161, చైనా నుంచి 10 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు గత ఏడేండ్లలో 8.5 లక్షల మంది భారతీయ పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ఈ నెల ప్రారంభంలో లోక్‌సభకు రాయ్ తెలిపారు.

ALSO READ Only Vaccinated People : వ్యాక్సిన్ తీసుకోనివారికి బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ