Corona Second wave : వణుకు పుట్టిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌.. ఒక్క రోజులోనే లక్షా 50 వేలకు పైగా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ దూకుడు పెంచుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంతో పెరుగుతోంది.

increasing corona cases in India : దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ దూకుడు పెంచుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య శరవేగంతో పెరుగుతోంది. భారత్‌లో నిన్న ఒక్కరోజులో లక్షన్నరకు పైగా కేసులు నమోదవడం.. ఇవాళ కూడా లక్షన్నరకు పైగానే కేసులు నమోదయ్యే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్‌లోకి రావడం లేదు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్నాటక, కేరళపై కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగం మహారాష్ట్రలో నమోదవుతుండగా.. మిగతా కేసుల్లో ఎక్కువ ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.

దేశంలో వరుసగా ఐదురోజులుగా కేసులు లక్ష దాటాయి. ఇవాళ కూడా కేసులు లక్షన్నర మార్క్‌ను దాటనున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. 24 గంటల్లో కరోనాతో 839 మంది మృతిచెందారు. గతేడాది అక్టోబర్‌ 16 తర్వాత దేశంలో ఇన్ని కరోనా మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి.

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి రోజురోజుకు దిగాజారుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ పరిస్థితులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కరోజే దాదాపు 54 వేల 411 వేల కేసులు నమోదయ్యాయిక్కడ. కరోనా బారిన పడి 309 మంది మరణించారు.

ఛత్తీస్‌గఢ్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులో 14 వేల 98 కేసులు, 123 మరణాలు సంభవించాయి. ఇక ఉత్తరప్రదేశ్‌పైనా వైరస్‌ పంజా విసురుతోంది. 24 గంటల్లో 12 వేల 748 కేసులు నమోదవగా.. 46 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. కర్నాటకలో 10 వేల 250 కేసులు, 40 మరణాలు.. కేరళలో 6 వేల 176 కేసులు నమోదవగా.. 17 మంది మృతిచెందారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. రానున్న రెండు మూడు వారాల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఏపీలో ఒక్కరోజే 3 వేల 495 కేసులు నమోదవగా.. తొమ్మిది మంది మరణించారు. ఇక తెలంగాణలో 24 గంటల్లో 3 వేల 187 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఏడుగురు మృతిచెందారు.

ట్రెండింగ్ వార్తలు