Bonfire
Bonfire : చలితో దేశ ప్రజలు వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో చాలామంది చలి నుంచి ఉపశమనం కోసం చలి కాచుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి చలి కాచుకునేందుకు దొంగిలించిన బైక్‌కె నిప్పంటించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నగరంలోని యశోధనగర్‌లో గత కొంతకాలంగా బైక్ చోరీలు పెరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంత వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి : Weather Report : ఉత్తరభారతావనిలో చలిగాలులు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాత నేరస్తుడు సర్పరాజ్‌తో పాటు అతని నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకోని విచారించారు. అయితే మొత్తం 10 బైక్‌లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు సర్ఫరాజ్.. పోలీసులు అతడి వద్ద నుంచి 9 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. పదో బైక్ కోసం సర్ఫరాజ్‌ని ప్రశ్నించగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో దానికి నిప్పు పెట్టి చలి కాగినట్లు తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.
చదవండి : Weather Update: నేడు మరో అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు!