Electricity Bill : నెలకు కరెంట్ బిల్లు రూ.3419 కోట్లు-ఆస్పత్రిలో చేరిన ఇంటి యజమాని

కరెంట్ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె పోటు వచ్చినంత పనై ఆస్పత్రిలో చేరిన ఘటన మధ్య‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Electricity Bill :  కొద్ది రోజలు క్రితం పూరి గుడిసెలకు కూడా కరెంట్ బిల్లులు లక్షల్లో వచ్చిన సందర్భాలు…. వాటిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు దూషించుకోవటం చూస్తూనే ఉన్నాం. తాజాగా కరెంట్ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె పోటు వచ్చినంత పనై ఆస్పత్రిలో చేరిన ఘటన మధ్య‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

గ్వాలియర్ లోని సంజీవ్ కంకణే అనే వ్యక్తి ఇంటికి ఎలక్ట్రిసిటీ డిపార్టు మెంట్ వారు జులై నెలకు సంబంధించి నెలవారీ బిల్లు జారీ చేశారు. అందులో ఆ నెలకు వారు కట్టాల్సిన బాకీ రూ. 3419 కోట్ల రూపాయలుగా చూపించారు. ఈ బిల్లును ఆ ఇంటి కోడలుకు ఇచ్చేసి విద్యుత్ సంస్ధ ఉద్యోగి వెళ్లిపోయాడు.

కొద్ది సేపటి తర్వాత ఇంటి యజమాని వచ్చి బిల్లు చూసి  షాక్ కు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కరెంట్ బిల్లు చూశాకే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  కాగా… సిబ్బంది నిర్వాకం వల్లే ఈ పొరపాటు జరిగిందని విద్యుత్ సంస్ధ అధికారులు చెప్పారు.

బిల్లు ప్రింటు చేసే సమయంలో రూ. 1300 కు బదులుగా కన్స్యూమర్ నెంబర్ వేయటం వల్ల ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. బిల్లు సవరించి కొత్త బిల్లు జారీ చేయనున్నట్లు చెప్పారు.  ఈ ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ కూడా విచారం వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ బిల్లు చూసి ఆ వృధ్దుడు ఆస్పత్రి పాలయ్యాడు.

Also Read : Viral Video : విమానంలో సప్లై చేసిన భోజనంలో పాము తల

ట్రెండింగ్ వార్తలు