A Suitable Boy పై హోం మంత్రి సీరియస్

  • Publish Date - November 23, 2020 / 12:15 AM IST

Netflix ‘A Suitable Boy : నెట్ ఫ్లిక్స్ లోని ఏ సూటబుల్ బాయ్ చిక్కులను ఎదుర్కొంటోంది. విక్రమ్ సేతు నవల ఆధారంగా..ఈ సిరీస్ తెరకెక్కింది. ఆలయ పరిసరాల్లో ముద్దు సీన్లు ఉండడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సిరీస్ దర్శక నిర్మాత మీరా నాయర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.



తాజాగా…మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తం మిశ్రా సీరియస్ అయ్యారు. వెంటనే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ షోపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అందులో ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలను పరిశీలించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.



ఓటీటీ ఫ్లాట్ పాంపై ఎందుకు ప్రసారం చేశారో తెలుసుకోవాలని సూచించారు. దీనిపై ఏ సూటబుల్ బాయ్ యూనిట్, నెట్ ఫ్లిక్స్ స్పందించాల్సి ఉంది. దర్శకురాలు మీరా నాయర్ గతంలో తీసిన సినిమాలు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.



దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ..యువ బీజేపీ నేత గౌరవ్ తివారీ రేవా ఎస్పీ రాకేశ్ కుమార్ సింగ్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ తమ ఫోన్ల నుంచి నెట్ ఫ్లిక్స్ ను అన్ ఇన్ స్టాల్ చేయాలని ట్విట్టర్ లో ప్రజలను కోరారు. దీని తర్వాత..#BoycottNetflix ట్విట్టర్‌లో ట్రెండింగ్ మారిపోయింది.



లవ్‌ జిహాద్‌ను అరికట్టడం కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడతామని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తం మిశ్రా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో మత మార్పిడికి పాల్పడితే నాన్‌ బెయిల్‌ కేసులు నమోదు చేసి, ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.