స్కూల్లో టాయ్ లెట్లు కడుగుతున్న ప్రిన్సిపల్..ఎందుకంటే..

  • Publish Date - November 19, 2019 / 06:27 AM IST

ఈరోజు (నవంబరు 19) వరల్డ్ టాయ్ లెట్ క్లీనింగ్ డే. ఈ సందర్భంగా విద్యార్ధుల కోసం..వారి ఆరోగ్యం కోసం  ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం..అది మధ్యప్రదేశ్ లోని షాపూర్‌ పరిధిలోని సహజ్ పూర్ హైస్కూల్. ఆ స్కూల్ ప్రిన్పిపల్  లక్ష్మీ పోత్రె.  తన స్కూల్లోని విద్యార్ధులు ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకూడదని లక్ష్మీ పోత్రె అనుకుంటారు. అందుకోసం ఆమె స్వయంగా ప్రతీ రోజు స్కూల్  టాయ్ లెట్ క్లీన్ చేస్తుంటారు. ఇలా ప్రతీ రోజు స్కూల్ కు రాగానే ఆమె చేసే పని అది. 

అంతేకాదు లక్ష్మీ పోత్రె స్కూల్ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచేలా చేస్తుంటారు. ప్రిన్సిపాల్ చేస్తున్న పనిని చూసిన విద్యార్థులంతా ఆమెకు సహాయం చేస్తారు. స్కూల్  స్టాఫ్, గ్రామస్తులు కూడా స్కూల్ తో పాటు పరిసరాలన్నీ  పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తుంటారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మి మాట్లాడుతూ.. తాను ఏడేళ్ల క్రితం ఈ స్కూల్ కు ప్రిన్సిపల్ గా అడుగుపెట్టినప్పుడు ఇక్కడి పరిస్థితులు ఎంతో అధ్వాన్నంగా ఉండేవనీ..అది చూసి తనకు ఎంతో బాధ కలిగిందనీ ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దుతూ వస్తున్నానన్నారు. గ్రామస్తులకు కూడా పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పిస్తున్నానని అన్నారు.దీంతో గ్రామస్థుల్లో మంచి మార్పు వచ్చింది. వారు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరిస్తున్నారని తెలిపారు. 

ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనిది కాదు. ముఖ్యంగా టాయ్ లెట్లు. కొన్ని స్కూళ్లకు అస్సలు టాయ్ లెట్లే ఉండవు. దీంతో ఎంతోమంది బాలికలు స్కూల్స్ మానివేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిస్కూళ్లలో  టాయ్ లెట్స్ ఉన్నా వాటి చూస్తేనే రోగాలు వస్తాయా అన్నట్లుగా ఉంటాయి. వీటి గురించి స్కూల్ స్టాప్ కూడా పెద్దగా పట్టించుకోరు. ఇటువంటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు సహజ్ పూర్ హైస్కూల్ ప్రిన్పిపల్  లక్ష్మీ పోత్రె. తన విద్యార్ధులు ఆరోగ్యంగా ఉండాలనే ఆమె ఆకాంక్ష.. ఆదర్శనీయమైంది. ఆమెలా అన్ని స్కూల్ సిబ్బంది ఆరోచిస్తే..ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ అనే మాటే వినిపించదు.