వజ్రాలు, బంగారం దొరికితే ఏం చేస్తారు ? ఇంకేం చేస్తాం..వెంటనే తమ దగ్గరే ఉంచుకుని..మంచి రేటు వస్తే..ఎవరికైనా ఇచ్చేస్తాం. అంటారు కదా..కానీ ఓ కూలీ మాత్రం తన దగ్గర దొరికిన..వజ్రాలను నిజాయితీగా అధికారులకు ఇచ్చాడు.
అక్కడి అధికారులు..ట్యాక్స్ లు పోను..మార్కెట్ ప్రకారం..ఎంత వస్తే..అన్ని డబ్బుు అతనికి ఇచ్చేయడం జరుగుతుందని వెల్లడిస్తున్నారు. వజ్రాల వేటలో ఉన్న అతనికి ఏకంగా మూడు వజ్రాలు దొరికాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుబల్ అనే వ్యక్తి పన్నా ప్రాంతంలో వజ్రాల కోసం వెతుకుతున్నాడు. అంతలోనే..7.5 క్యారెట్ ల విలువైన వజ్రాలు దొరికాయి. అయితే..దొరికిన వజ్రాలను నిజాయితీగా..అధికారులకు ఇచ్చేశాడు.
దీంతో వాటి విలువ రూ. 35 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ట్యాక్స్ లు పోనూ..మార్కెట్ విలువలో 88 శాతం దక్కుతుందని అధికారులు తెలిపారు. బుందేల్ ఖండ్ లోని పన్నా ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే.