MP minister : రూ.100 ఇస్తే..సెల్ఫీ ఇస్తా

ఎవరైనా రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్.. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు.

MP minister ఎవరైనా రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్.. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు. అంతేకాకుండా తనను కలవడానికి వచ్చే వాళ్లు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇస్తే తీసుకుంటానని ఆమె తెలిపారు.

శనివారం ఖండ్వాలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఉషా ఠాకూర్..సెల్ఫీలు తీసుకునే సమయంలో చాలా సమయం వృద్ధా అవుతోంది. దీని వల్ల కొన్నిసార్లు మాకు చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి పార్టీ పరంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరైతే సెల్ఫీలు క్లిక్ చేస్తారో వారు స్థానిక మండల పార్టీ యూనిట్‌ కోశాధికారికి రూ.100 జమ చేయాలి. ఇలా సమకూరిన డబ్బును పార్టీ పనుల కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు.

అదేవిధంగా బహిరంగ కార్యక్రమాలకు తనను ఆహ్వానించేవారు బొకేలు(పుష్పగుత్తులు)కి బదులు పుస్తకాలు ఇస్తే.. పార్టీ కార్యాలయంలో ఆ పుస్తకాలతో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. పువ్వులతో ప్రజలను స్వాగతించే దానికి సంబంధించి.. లక్ష్మీ దేవి వారిలో నివసిస్తుందని మనందరికీ తెలుసు. కాబట్టి మచ్చలేని విష్ణువు తప్ప మరెవ్వరూ పువ్వులు అంగీకరించలేరు. కాబట్టి, నేను పువ్వులను అంగీకరించను అని మంత్రి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫ్లవర్ బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని సూచించారని మంత్రి గుర్తుచేశారు.

ట్రెండింగ్ వార్తలు