బీజేపీ నేతల చెంప పగల కొట్టిన జిల్లా కలెక్టర్ 

  • Publish Date - January 19, 2020 / 11:48 AM IST

అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ , డిప్యూటీ కలెక్టర్ల పై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకుల  చెంప చెళ్లు మనిపించారు మహిళా కలెక్టర్లు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు సీఏఏ కు అనుకూలంగా  తిరంగా యాత్రను నిర్వహించారు.

ఈ ర్యాలీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి తీసుకోకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారని రాజ్ గఢ్ కలెక్టర్ నివేధిత.  డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మలు  తిరంగా యాత్రను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ మాజీఎమ్మెల్యే కలెక్టర్ తో ఘర్షణ పడగా, డిప్యూటీ కలెక్టర్ తో కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వారితో  దురుసుగా ప్రవర్తించారు.

దీంతో  రెండు ఘటనల్లోనూ అధికారులు ఆ బీజేపీ నేతల చెంప పగల కొట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.  కాగా కలెక్టర్ బీజేపీ కార్యకర్తను చెంప చెళ్లుమనపించిన వీడియోను బీజేపీ నాయకుడు ,మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.