Sudha Murty : ప్రజల నుండి నెగెటివిటీ ఎదుర్కోవడంలో.. రిషి సునక్, అక్షతలకు సుధామూర్తి ఇచ్చే సలహా ఏంటంటే?
యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తిలకు ప్రజల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సుధామూర్తి వారికి ఇచ్చే సూచనలను మీడియాతో ప్రస్తావించారు.
- Lakshmi 10tv
- Published On : January 27, 2024 / 03:59 PM IST
Sudha Murty
Sudha Murty : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులు ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో సుధామూర్తి అల్లుడు రిషి సునక్ కూతురు అక్షతల గురించి ప్రస్తావించారు. ప్రజల నుండి వారికి సవాళ్లు ఎదురైనపుడు ఎలా ప్రవర్తించాలో తాను సలహా ఇస్తానని చెప్పుకొచ్చారు.
సాధారణమైన వ్యక్తులే చాలా సందర్భాల్లో నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది సెలబ్రిటీల విషయంలో అది చాలా ఎక్కువగా ఉంటుంది. రీసెంట్‌గా సుధామూర్తి తన అల్లుడు UK ప్రధాని రిషీ సునక్, కూతురు అక్షతా మూర్తి గురించి మాట్లాడారు. వారి కుటుంబంపై ప్రజల అభిప్రాయాలు వారు చేసే విమర్శలపై ఒకోసారి చర్చించుకుంటామని.. ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలో తాను సూచనలు చేస్తానని సుధామూర్తి చెప్పారు. ప్రజలు ఎప్పుడూ పర్సన్‌ని బట్టి కాకుండా పొజిషన్‌ని బట్టి మాట్లాడుతుంటారని.. మనం చేసే పని నీతివంతంగా, చట్టపరంగా చేసుకుపోవడమేనని సుధామూర్తి వారికి చెబుతారట. ‘జనం మాట్లాడుతూనే ఉంటారు.. మాట్లాడమే వారి పని’ అనే లోకోక్తి ఉన్నట్లు వారు మాట్లాడుతూనే ఉంటారు.. మనం చేసుకునే పని చేసుకుని వెళ్లిపోవడమే అని సుధ వారికి చెప్తారట. మనం చేసే ప్రతి పనికి భగవంతుడే సాక్ష్యం కాబట్టి మీ దేశం కోసం కష్టపడండి.. మీ దేశానికి సేవ చేయండని తమ అల్లుడు, కూతురికి సూచిస్తుంటానని సుధామూర్తి చెప్పారు.
Sudha Murty : సుధామూర్తి సిబ్బందినంటూ డబ్బులు వసూళ్లు .. వ్యక్తి అరెస్ట్, ఇద్దరు మహిళలపై కేసు నమోదు
సింప్లిసిటీకి మారుపేరు సుధామూర్తి. తమ జీవితంలో ఎదురైన అనుభవాలతో పాటు అనేక అంశాలపై స్ఫూర్తివంతమైన మాటలు చెబుతారు సుధామూర్తి. అందుకే సుధామూర్తిని అనేమంది అభిమానిస్తారు.
