Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటల పని వ్యాఖ్యలపై ఆసక్తికర విషయం చెప్పిన భార్య సుధామూర్తి

2005లో ఇన్ఫోసిస్ లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతనం ఏడాదికి 3.5 లక్షలు ఉంటే 2023 లోను అంతే ఇస్తున్నారని, 15 లక్షల ప్యాకేజీ ఇస్తే ఆయన అంచనాలకు మించిన దాని కంటే 40 గంటలు ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు

Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటల పని వ్యాఖ్యలపై ఆసక్తికర విషయం చెప్పిన భార్య సుధామూర్తి

Sudha Murthy: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వర్క్ కల్చర్ గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సి ఉంటుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ ప్రజలు ఎలాగైతే విరామం లేకుండా పనిచేశారో అలాగే భారత యువత కూడా పని చేయాలంటూ ఒక పాడ్ క్యాస్ట్ లో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అయితే చాలామంది ఐటీ ఉద్యోగులు మాత్రం 70 గంటలు పని చేయాలన్న ఆయన వాదనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విమర్శలకు నారాయణమూర్తి భార్య సుధా మూర్తి తాజాగా స్పందించారు. అప్పట్లో నారాయణమూర్తి రోజుకు 80 నుంచి 90 గంటలు పని చేసే వారని, ఆయన నిజమైన హార్డ్ వర్కర్ అని సుధామూర్తి కితాబు ఇచ్చారు. ‘‘ఆయన చాలా కష్టపడే వ్యక్తి. వారంలో 80 నుంచి 90 గంటలు పని చేసిన వ్యక్తి. అందుకే తన అనుభవంతో చెప్పారు. ఆయన అనుభవంతో చూస్తే 70 గంటలు చిన్నదే. ఆయన తన కష్టాన్ని నమ్ముకున్నారు. అలాగే పైకొచ్చారు. అదే చెప్పారు’’ అని సుధామూర్తి అన్నారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: రాజస్థాన్‭లో విచిత్రమైన సంప్రదాయం.. రవాణా మంత్రిగా పని చేస్తే రాజకీయానికి ముగింపే!

ఇక నారాయణమూర్తి వ్యాఖ్యలపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. చాలామంది నారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు . 2005లో ఇన్ఫోసిస్ లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతనం ఏడాదికి 3.5 లక్షలు ఉంటే 2023 లోను అంతే ఇస్తున్నారని, 15 లక్షల ప్యాకేజీ ఇస్తే ఆయన అంచనాలకు మించిన దాని కంటే 40 గంటలు ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. జీతాలు తక్కువ ఇచ్చి ఎక్కువ పని గంటలు పని చేయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతాలు ఇస్తారా అంటూ ప్రశ్నించడం ప్రధానంగా కనిపిస్తోంది.