Sudha Murty : సుధామూర్తి సిబ్బందినంటూ డబ్బులు వసూళ్లు .. వ్యక్తి అరెస్ట్, ఇద్దరు మహిళలపై కేసు నమోదు

ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశారు.

Sudha Murty : సుధామూర్తి సిబ్బందినంటూ డబ్బులు వసూళ్లు .. వ్యక్తి అరెస్ట్, ఇద్దరు మహిళలపై కేసు నమోదు

Sudhamurthy

priest cheating in name of Sudhamurthy was arrested : అతనో పూజారి. పైగా యువకుడు. ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. దీని కోసం ప్రముఖుల పేర్లు చెప్పటం డబ్బులు వసూళ్లు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. దీంట్లో భాగంగా ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణ మూర్తి భార్య, సంఘసేవకురాలు, రచయిత్రి సుధామూర్తి పేరు చెప్పి రూ.5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అమెరికాలో జరిగే ఓ కార్యక్రమానికి సుధామూర్తిని తీసుకొస్తానని నమ్మించి కార్యక్రమ నిర్వాహకుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసిన బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల పూజారిని పోలీసులు ఆదివారం (అక్టోబర్ 16,2023)అరెస్ట్ చేశారు. అతను రాజాజీనగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సదరు పూజారి కంటే ముందు ఇద్దరు మహిళలు కూడా సుధామూర్తి పేరుతో మోసాలకు పాల్పడ్డారు. ఈ విషయం సుధామూర్తి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమతా సంజయ్ దృష్టికి వచ్చింది.  దీంతో సెప్టెంబర్ 22న జయనగర్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సదరు ఇద్దరు మహిళలను గుర్తించారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. సదరు మహిళలు తాము రచయిత్రులుగా చెప్పుకుంటు సుధామూర్తి పేరుతో మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈక్రమంలో అరుణ్ కుమార్ అనే పూజారి పేరు బయటకొచ్చింది. సుధామూర్తి పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

LinkedIn Layoff : లింక్డ్‌ఇన్ నుంచి 668 మంది ఉద్యోగులు ఔట్.. ఎందుకంటే?

2023 ఏప్రిల్ 5న ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన కన్నడ కూటా 50వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుధామూర్తిని పాల్గొనవలసిందిగా ఈమెయిల్ ద్వారా విన్నవించింది కన్నడకూటా. కానీ సుధామూర్తి మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు కానీ తనకు రావటం వీలుకాదు అని తెలిపారు. కానీ సుధామూర్తి  పర్సనల్ అసిస్టెంట్ గా చెప్పుకుంటున్న ఓ మహిళ పాల్గొంటుద‌నే విషయాన్ని ధృవీకరించింది.

ఈ క్రమంలో మరో మహిళ ఈ విషయాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. సెప్టెంబర్ 26న అమెరికాలోని సేవా మిల్పిటాస్ లో జరిగే మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి కార్యక్రమానికి సుధామూర్తి పాల్గొంటారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేసింది. దీంతో ఈ కార్యక్రమానికి చెందిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్మడైపోయాయి. ఒక్కొ టికెట్ 40డాలర్లు అమ్ముడయ్యాయి. ఇక్కడితో ఆగి ఉంటే ఈ నిర్వాకం బహుశా బయటపడేది కాదేమో. దీన్ని మరింతగా క్యాష్ చేసుకోవటానికి సదరు రెండో మహిళ భర్తకు బంధువైన అరుణ్ కుమార్ అనే పూజారి ఓ మహిళ గొంతుతో కార్యక్రమ నిర్వాహకులతో మాట్లాడి సుధామూర్తి ఆ కార్యక్రమానికి రప్పిస్తాను అంటూ వారి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

Sundar Pichai thanks PM Modi : ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ…ఏం చర్చించారంటే…

దీంతో మొత్తం యవ్వారం బయటపడటంతో పూజారి అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు మహిళపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశారు. గతంలో ఇటువంటివి ఎన్ని మోసాలు చేశారు..? ఎన్నాళ్లుగా చేస్తున్నారు..? ఈ మోసాలతో ఎంత డబ్బు వసూలు చేశారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.