కాంగ్రెస్ అభ్యర్థికి అంబానీ మద్దతు

సార్వత్రిక ఎన్నికలు జరుగుతన్న సమయంలో మహారాష్ట్రలో ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.నిత్యం తన తమ్ముడు అనిల్ అంబానీపై తీవ్ర విమర్శలు చేస్తుండే కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ అంబానీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలంద్ డియోరాకు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ మద్దతు ప్రకటించారు. మిలింద్‌ దక్షిణ ముంబై వ్యక్తి. ఈ నియోజకవర్గానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై ఆయనకు లోతైన అవగాహన ఉంది అని ముఖేష్ అన్నారు. అంతేకాకుండా ఇండియన్ బిలీనియర్ బ్యాంకర్,కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కొటక్ కూడా మిలిందకు మద్దతు ప్రకటించారు.

ముఖేష్ అంబానీ,ఉదయ్ కొటక్ తనకు మద్దతు ప్రకటించడంపై మిలింద్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్న చిన్న వ్యాపారస్థుల దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ల వరకూ అందరికీ దక్షిణ ముంబై అంటే వ్యాపారమేనని, ముంబైలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మన యువతకు ఉపాధి కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మిలింద్ అన్నారు. 

బీజేపీ-శివసేన పొత్తులో భాగంగా ముంబై సౌత్ స్థానం నుంచి శివసేన పోటీలో ఉంది.అరవింద్ సావంత్ శివసేన ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు.ఏప్రిల్-29,2019 ముంబై సౌత్ లోక్ సభ స్థానానికి ఎన్నిక జరుగనుంది.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి