Mukesh Ambani
Mukesh Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు. గుజరాత్ లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీలో స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముకేశ్ అంబానీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. దేశాభివృద్ధిలో నేటి యువత ఎంతో కీలకమన్న ఆయన.. యువ ఆలోచనలు, ఆవిస్కరణలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు.
Mukesh Ambani: ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్-3లో భారత్ నిలుస్తుంది: ముకేశ్ అంబానీ
ప్రతీఒక్కరూ మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలను మర్చిపోవద్దని అంబానీ సూచించారు. ప్రతీఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గొప్పదన్న ఆయన.. అమ్మానాన్నల ప్రాముఖ్యాన్ని యువతకు అర్థమయ్యేలా నేటి టెక్నాలజీని పోల్చుతూ వివరించారు. నేటియువత 4జీ, 5జీ గురించి ఎంతో ఉత్సకతతో ఉన్నారని, కానీ ఈ ప్రపంచంలోనే మాతాజీ, పితాజీ కంటే ఏ ‘జీ’ ఎక్కువ కాదని, ఇది ప్రతీఒక్క యువత గుర్తుపెట్టుకోవాలని అంబానీ సూచించారు. ఇది మీరోజు, ప్రపంచానికి మీరెంటో తెలిసే రోజు, కానీ మీరు నిల్చున్నది మాత్రం మీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ల రెక్కలపైనే అన్న విషయాన్ని మరవద్దని అంబానీ సూచించారు.
Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ.. ధర ఎంతో తెలుసా!
మీరు గ్రాడ్యుయేషన్ పత్రాన్ని అందుకోవాలని మీకంటే వారు ఎక్కువగా కొరుకొని ఉంటారు. మిమ్మల్ని ఇక్కడకు తీసుకురావడానికి వారు చేసిన త్యాగాలు, వారు పడిన శ్రమను ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ విజయం వెనుక వారి సహకారం ఎనలేనిదని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలంటూ అంబానీ యువతకు సూచించారు.