Mukesh Ambani
World Billionaires 2023: ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ (Forbes World Billionaires) 2023 జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ప్రపంచంలో అత్యంత ధనికుల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. అంబానీ 83.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ఉన్నారు. అంబానీ గతేడాది 10వ స్థానంలో నిలవగా.. ప్రస్తుతం ఒక స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మైక్రోసాప్ట్‌కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్‌కు చెందిన లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్ బర్గ్, డెల్ టెక్నాలజీస్‌కు చెందిన మైఖేల్ డెల్ కంటే ముఖేష్ అంబానీ ముందు వరుసలో ఉన్నారు.
World Richest Person : 2022 ఏడాది చివరిలో ప్రపంచంలో టాప్ 10 సంపన్నులు వీరే.. ఇండియాలో..
2023 ప్రపంచ కుబేరులో జాబితాలో 211 బిలియన్ డాలర్ల నికర విలువతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ మొదటి స్థానంలో నిలిచాడు. 180 బిలియన్ డాలర్ల నికర విలువతో ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో నిలిచారు. 114 బిలియన్ డాలర్ల నికర విలువతో జెఫ్ బెజోస్ మూడవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలువగా.. ఆసియాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. బిలియనీర్ల జాబితాలో అదానీ ర్యాంకు పడిపోయింది.
గతంలో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకిన గౌతమ్ అదానీ ఇటీవల తన వ్యాపార సామ్రాజ్యంలో నష్టాల వల్ల భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయాడు. దీంతో 2023 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 24వ స్థానానికి దిగజారాడు. అతని మొత్తం ఆస్తులు 47.2 బిలియన్ డాలర్లుగా అంచనా. అయితే భారతదేశంలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచాడు.
దేశంలో మూడో బిలియనీర్ గా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ నిలిచాడు. అతని నికర విలువ 25.6 బిలియన్ డాలర్లు. ప్రపంచ ర్యాంకింగ్ లో 55వ స్థానంలో ఉన్నాడు. ఇదిలాఉంటే ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 2,640 మంది బిలియనీర్లు ఉన్నారు. వారిలో భారత్ కు చెందిన వారు 169 మంది ఉన్నారు.