ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో ఫోన్‌ స్వాధీనం

Ia

ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలను ఉంచడానికి కారణమైన ఫోన్‌ను తిహార్ జైలు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌ను తీహార్ జైలులోని బ్యారక్ నంబర్ 8 లో ఉంచిన భారతీయ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది తెహసీన్ అక్తర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దానిని తీసుకుంది. ఈ ఫోన్ నుండే టెలిగ్రామ్ ఛానల్ పనిచేస్తుందని, దీని నుండి అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలను ఉంచే పనిని చేపట్టినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ ఫోన్ కు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఫిబ్రవరి 25న ముంబైలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఏరియాలో ముఖేష్ అంబానీ నివాసం ఉంటున్నారు.. ఆంటాలియాలో తన ఇంటికి దగ్గరగా ఉన్న వద్ద స్కార్పియో కారు కలకలం రేగింది. ఫిబ్రవరి 25న ఈ ఘటన జరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయని పోలీసులు తెలిపారు.