Mukesh Ambani: రిటైల్ యూనిట్ ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ కూతురు

బిలియనీర్ ముఖేశ్ అంబానీ కూతుర్ని రిలయన్స్ రిటైల్ యూనిట్‌కు ఛైర్మన్ గా నియమించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గ్రూప్‌ యాజమాన్యంలో వారసులకు బాధ్యతలను అప్పగించడంతో పాటు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ రంగం సిద్ధం చేశారు.

Isha Ambani

Mukesh Ambani: బిలియనీర్ ముఖేశ్ అంబానీ కూతుర్ని రిలయన్స్ రిటైల్ యూనిట్‌కు ఛైర్మన్ గా నియమించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గ్రూప్‌ యాజమాన్యంలో వారసులకు బాధ్యతలను అప్పగించడంతో పాటు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ రంగం సిద్ధం చేశారు.

ఇప్పటికే పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీకి టెలికాం విభాగానికి రిలయన్స్‌ జియో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కుమార్తె ఇషా అంబానీకి రిలయన్స్‌ రిటైల్ యూనిట్‌కు చైర్‌పర్సన్‌గా ఇషా ఎంపికైంది దీనికి సంబంధించిన ప్రకటన బుధవారం వెలువడనున్నట్లు అంచనా.

ఆసియాలోని అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతల అప్పగింత వ్యవహారంలో ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతోంది. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు.

Read Also : ముఖేశ్ అంబానీ రాజీనామా.. రిలయన్స్ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

పిరమల్‌ గ్రూప్‌నకు చెందిన ఆనంద్‌ పిరమల్‌ను ఇషా వివాహం చేసుకున్నారు. ఇషా యేల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ముకేశ్‌, నీతా అంబానీ దంపతుల ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఇషా ట్విన్స్‌ కాగా చిన్న కుమారుడు అనంత్‌.