గ్లోబల్‌ థింకర్స్‌-2019 : ముఖేశ్ అంబానీకి అగ్రస్థానం

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 04:30 AM IST
గ్లోబల్‌ థింకర్స్‌-2019 : ముఖేశ్ అంబానీకి అగ్రస్థానం

  గ్లోబర్ థింకర్స్ : ముఖేశ్ అంబానీకి అగ్రస్థానం
ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో ముకేశ్ అంబానీ
జియో నెట్ వర్క్ తో గుర్తింపు దక్కించుకున్న ముకేశ్
10 విభాగాల్లో గ్లోబల్ థింకర్స్ ఎంపిక
సాంకేతిక ఆలోచనాపరులలో ముకేశ్ కు అగ్రస్థానం
గ్లోబల్ థింకర్స్ 2019 ప్రకటించిన ఫారిన్ పాలసీ సంస్థ
జాబితాలో జాక్ మా,
బెజోస్, మిలిందా గేట్స్
  

ముంబై : జియో సెల్యూలర్ నెట్ వర్క్ తో కొత్త దేశంలో కొత్త డిజిటల్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన ముకేశ్ అంబానీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ముకేశ్‌ అంబానీ గ్లోబల్‌ థింకర్స్‌-2019 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఫారిన్‌ పాలసీ మొత్తం 100 మందితో ఈ జాబితా రూపొందించింది. ప్రస్తుతానికి కొంత మంది పేర్లనే వెల్లడించింది. పూర్తి జాబితాను ఈనెల 22న విడుదల చేస్తుంది. అంతర్జాతీయ ఆలోచనాపరుల జాబితాకు ఈ ఏడాది పదో వార్షికోత్సవం సందర్భంగా ఫారిన్‌ పాలసీ తన జాబితాను 10 విభాగాలుగా చేసి.. ఒక్కో విభాగంలో పది మంది పేర్లు ఇవ్వాలని నిర్ణయించింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వారితో తొలి గ్రూపు పేర్లు ఇవ్వనుంది.

ప్రపంచంలోనే అత్యంత ఆలోచనాపరుల జాబితాలో వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. సాంకేతిక ఆలోచనాపరుల జాబితాలో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. జియో నెట్ వర్క్ తో గత ఏడాది దేశంపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి ముకేశ్ అంబానీ.. తన కొత్త టెలికాం సంస్థ జియోతో భారత్‌పై అమిత ప్రభావాన్ని చూపారని ఫారిన్‌ పాలసీ అభిప్రాయపడింది. ‘సెల్యులార్‌ డేటా, వాయిస్‌ కాల్స్‌ను తొలి ఆరు నెలల పాటు ఉచితంగా ఇవ్వడం ద్వారా 10 కోట్ల మందికి పైగా వినియోగదార్లను ఎంతో త్వరగా తమ ఖాతాలో వేసుకున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఇంటర్నెట్‌ వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఫారిన్ పాలసీ తన నివేదికలో స్పష్టం చేసింది.

గత దశాబ్ద కాలంలో ప్రభావాన్ని చూపిన వ్యక్తుల జాబితాలో జాక్‌మా, క్రిస్టీన్‌ లగార్డేలు చోటు చేసుకున్నారు. యూరోపియన్‌ కమిషనర్‌ ఫర్‌ కాంపిటిషన్‌ మార్గరెట్‌ వెస్టాగర్‌, టీవీ వ్యాఖ్యాత ఫరీద్‌ జకారియా, బిల్‌మిలిందా గేట్స్‌, అమెజాన్‌ బెజోస్‌ గ్లోబల్ థింకర్స్ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు.