ఐఐటీలకు మాత్రమే దక్కుతుంది అనుకున్న గూగుల్ ఉద్యోగం మామూలు ఇంజినీరింగ్ చదివిన వ్యక్తికి దక్కింది. ఇరవై ఒక్కేళ్ల వయస్సులో 1.2కోట్ల జీతాన్ని అందుకునేందుకు సిద్దం అయ్యాడు.
ఐఐటీలకు మాత్రమే దక్కుతుంది అనుకున్న గూగుల్ ఉద్యోగం మామూలు ఇంజినీరింగ్ చదివిన వ్యక్తికి దక్కింది. ఇరవై ఒక్కేళ్ల వయస్సులో 1.2కోట్ల జీతాన్ని అందుకునేందుకు సిద్దం అయ్యాడు. ముంబైకి చెందిన అబ్దుల్లా ఖాన్ గూగుల్‌లో భారీ ప్యాకేజ్‌తో జాబ్ కొట్టాడు. ఇంత భారీ ఆఫర్ ని ఇచ్చిన సంస్థ ‘గూగుల్’ లండన్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో Google’s site reliability ఇంజనీరింగ్‌లో పనిచేసేందుకు అవకాశం ఇచ్చింది.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష
ముంబైలోని ఎల్‌ఆర్ తివారీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివిన అబ్దుల్లా ఖాన్.. గూగుల్ ఇంటర్వ్యూకు హాజరు కాగా అతనికి గూగుల్ అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో జరిగిన కొన్ని ఇంటర్వ్యూల తర్వాత ఫైనల్ స్క్రీనింగ్‌కు లండన్‌కు గూగుల్ రమ్మంది.
కాగా అక్కగ సెలెక్ట్ అయిన అబ్దుల్లా ఖాన్‌కు.. ఏడాదికి రూ.54.5లక్షల బేసిక్ శాలరీతో బోనస్‌లు రూ.58.9లక్షలను మొత్తం ఏడాదికి ప్యాకేజ్ ఇవ్వనున్నట్లు గూగుల్ పేర్కొంది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్దుల్లా ఖాన్ సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరనున్నాడు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ