Mumbai college : ముంబయి కళాశాలలో బురఖా, హిజాబ్‌పై ఆంక్షలు

ముంబయి కళాశాలలో బురఖాపై కళాశాల యాజమాన్యం ఆంక్షలు విధించింది. ముంబయిలోని చెంబూర్‌లో బుధవారం ఓ కళాశాలలో బురఖాలు ధరించిన విద్యార్థినులను ప్రాంగణంలోకి రానివ్వకుండా నిషేధించింది. దీంతో కళాశాల గేట్ వెలుపల బాలికల తల్లిదండ్రులు,విద్యార్థులు నిరసనలకు దిగారు....

students wearing burqas

Mumbai college : ముంబయి కళాశాలలో బురఖాపై కళాశాల యాజమాన్యం ఆంక్షలు విధించింది. ముంబయిలోని చెంబూర్‌లో బుధవారం ఓ కళాశాలలో బురఖాలు ధరించిన విద్యార్థినులను ప్రాంగణంలోకి రానివ్వకుండా నిషేధించింది. దీంతో కళాశాల గేట్ వెలుపల బాలికల తల్లిదండ్రులు,విద్యార్థులు నిరసనలకు దిగారు. (restricts entry to students wearing burqas) బాలికల తల్లిదండ్రులు ఎన్‌జి ఆచార్య అండ్ డికె మరాఠే కాలేజీ గేట్ ముందు ప్రదర్శన చేయడంతో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. (Mumbai college) విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Free Petrol : వాహనదారులకు బంపర్ ఆఫర్.. హైదరాబాద్‌లో పెట్రోల్ ఫ్రీ, మీకు కావాలంటే వెంటనే ఇలా చేయండి..

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు, కళాశాల అధికారులతో చర్చించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాయంత్రం నాటికి కళాశాలలో బాలికలు దుస్తులు ధరించేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని నియమాలను స్పష్టం చేస్తూ కళాశాల ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సంవత్సరం కళాశాలలో కొత్తగా డ్రెస్ కోడ్‌ను అమలు చేశామని, నిబంధనలను తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ విద్యాగౌరీ లేలే పేర్కొన్నారు.

Crop Loan Waiver : రైతులకు శుభవార్త.. నేటి నుంచి రుణమాఫీ, తొలి విడతలో రూ.19వేల కోట్లు

‘‘మే నెల 1వతేదీన మేం కళాశాలలో ఈ కొత్త డ్రెస్ కోడ్ విధానంపై చర్చించడానికి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాం. మేం బురఖా, హిజాబ్, స్కార్ఫ్‌లు, స్టిక్కర్‌లపై నిషేధంతో సహా ప్రతి విషయాన్ని తెలియజేశాం. అప్పట్లో డ్రెస్ కోడ్ కు అందరూ అంగీకరించారు. కానీ వారు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు’’ అని ప్రిన్సిపల్ చెప్పారు. డ్రెస్ కోడ్‌ను వ్యతిరేకించే బాలికలు కాలేజీని విడిచిపెట్టవచ్చని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. హిజాబ్ లేదా బురఖా ధరించకుండా ఇల్లు వదిలి వెళ్లడం తమకు మతపరమైన ఆచారం కాబట్టి అసౌకర్యంగా ఉందని కళాశాలలో ముస్లిం బాలికలు చెప్పారు.

Chandrababu Naidu : ఒక్క వాలంటీర్‌ను కూడా వదిలిపెట్టను- చంద్రబాబు సీరియస్ వార్నింగ్

బాలికల భద్రత, గౌరవాన్ని పరిగణనలోకి తీసుకుని బురఖా, హిజాబ్ లేదా కండువా ధరించి కళాశాలకు రావడానికి అనుమతిస్తామని కళాశాల పేర్కొంది. అయితే బాలికలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వాష్‌రూమ్‌లో దాన్ని తీసివేయవలసి ఉంటుంది. సాయంత్రం తరగతి గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు మళ్లీ బురఖా, హిజాబ్ ధరించవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కర్ణాటకలోని కాలేజీల్లో హిజాబ్‌పై ఇదే విధమైన నిషేధం గత ఏడాది వివాదం రేపింది. ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లి దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.

ట్రెండింగ్ వార్తలు