Covid Protocol : కరోనా నిబంధనలు, భద్రతపై రాజీ పడేది లేదు..బాలీవుడ్ నటుడిపై కేసు

బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. FIR నమోదు చేసినట్లు బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) వెల్లడించింది.

Mumbai Corporation : కరోనా నిబంధనలు పాటించని వారిపై మహారాష్ట్ర సర్కార్ కొరఢా ఝులిపిస్తోంది. ఎందుకంటే..అక్కడ విపరీతంగా కేసులు రికార్డవుతున్నాయి. కొంతమంది నిర్లక్ష్యం వల్లే..కేసులు పెరుగుతున్నాయని ప్రజలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. భారీగా జరిమానాలు సైతం విధిస్తోంది. తాజాగా..ఓ బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. FIR నమోదు చేసినట్లు బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) వెల్లడించింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. అయితే..ఆ నటుడి పెరు మాత్రం వెల్లడించలేదు. నగర భద్రతపై రాజీ పడేది లేదు..కరోనా నిబంధనలు పాటించని వారిని ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన ఒక్కరోజే 16 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గత ఐదు నెలల్లో నమోదైన డైలీ కేసుల్లో నిన్న వచ్చిన కేసులే ఎక్కువ. దీంతో ముంబై, పుణె, నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌లో కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నాగ్‌పూర్‌లో 15 నుంచి 21 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించింది.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 60శాతానికి పైగా ఇక్కడే నమోదవుతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా మహారాష్ట్ర వాసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబరు నుంచి కాస్త తగ్గుతూ వచ్చిన కేసులు…20 రోజుల నుంచీ మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య కోటీ 13లక్షల 85వేల339కి పెరిగింది. కోటీ 10లక్షల మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా రెండు కోట్ల 99లక్షల 8వేల మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు