కుప్పకూలిన పబ్లిక్ టాయ్ లెట్..శిథిలాల్లో చిక్కుకున్న మహిళ మృతి

  • Publish Date - November 23, 2020 / 04:53 PM IST

Mumbai woman collapsed public toilet dies : ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఒక పబ్లిక్ టాయిలెట్ కుప్పకూలింది. ఆ కుప్పకూలిన టాయిలెట్ లోపల చిక్కుకున్న 55 ఏళ్ల మహిళ శిథిలాల్లో చిక్కుకుపోయింది. సోమవారం (నవంబర్ 23,2020) ఉదయం 7.40 గంటల సమయంలో కుర్లా-వెస్ట్‌లోని నాజ్ హోటల్ వెనుక జరిగింది.



ఈ ఘటనలో ఆ మహిళను పోలీసులు రక్షించారు.ఇక దీనికి సంబంధించి సహాయక చర్యలను ప్రారంభించడానికి అగ్నిమాపక దళం తమ బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ ఘటనలో సదరు మహిళకు చిన్న చిన్న గాయాలు కావటంతో ఆమెను ప్రథమ చికిత్స చేసి..అనంతరం హాస్పిటల్ కు తరలించారు. కాగా..దురదృష్టవశాత్తూ ఆ మహిళ కన్నుమూసింది.
https://10tv.in/mumbai-event-manager-raped-at-delhi-5-star-hotel-2-dhaba-owners-arrested/


మహిళ కాలు శిథిలాలలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. తరువాత అగ్నిమాపక దళం, పోలీసులు మరియు పౌర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటికీ గాయాలు తీవ్రంగా కావడంతో మరణించింది.