Covid-19 cases In Mumbai : ముంబైని కమ్మేస్తున్న కరోనా..23కొత్త ఒమిక్రాన్ కేసులు

కరోనా మొదటి, రెండో దశలో ముంబైని వణికించిన కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచుతోంది. కేసులు అత్యంత కనిష్టానికి చేరుకుంటున్నాయని భావిస్తున్న సమయంలో కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళనకు

Covid-19 cases In Mumbai :  కరోనా మొదటి, రెండో దశలో ముంబైని వణికించిన కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచుతోంది. కేసులు అత్యంత కనిష్టానికి చేరుకుంటున్నాయని భావిస్తున్న సమయంలో కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం ముంబైలో కొత్తగా 602 కరోనా కేసులు, ఒక మరణం నమోదైంది.

ఈ ఏడాది అక్టోబరు 6వ తేదీ తర్వాత ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి ముంబైలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 7,68,750కి చేరగా, మరణాల సంఖ్య 16,367కి చేరినట్లు బృహన్ ముంబై మున్సినల్ కార్పొరేషన్(BMC) తెలిపింది. ముంబైలో 2,813 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నట్టు బీఎంసీ తెలిపింది.

మరోవైపు,మహారాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 1179 కొత్త కోవిడ్ కేసులు,17మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 615మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 23మంది కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”బారినపడ్డారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు కనుక పెరిగినట్లయితే మళ్లీ స్కూల్స్ మూసివేయబడే అవకాశముందని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.

ALSO READ Theaters Close: థియేటర్ల మూసివేతతో అభిమానుల్లో నిరాశ

ట్రెండింగ్ వార్తలు