Mumbai Police Caught On Camera Feeding Cake To Criminal
Police feeding Cake to Criminal: పుట్టినరోజు వేడుకల్లో కరుడు కట్టిన క్రిమినల్ కు ఓ పోలీసు అధికారి అతనికి కేక్ తినిపించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు..ఫోటోలో సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. ఓ క్రిమినల్ కు ఓ పోలీసు అధికారి యూనిఫాంలో ఉండి కేక్ తినిపించటంపై విమర్శలు రావటంతో విచారణకు ఆదేశించారు. రెండు వారాల కిందటి ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు సదరు పోలీసు అధికారిపై గురువారం(జులై 15,2021) విచారణకు ఆదేశించారు.
హత్య కేసులతో పాటు పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా డానిష్ షేక్ అనే నేరస్థుడుకి ముంబయిలోని జోగేశ్వరి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర నెర్లేకర్ యూనిఫాంలో ఉండి కేక్ తినిపిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా ఉంది. నేరస్థుడు డానిష్ షైక్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పోలీస్ అధికారి.. నేరస్థుడికి కేక్ తినిపించాడు. అదే సమయంలో ఓ వ్యక్తి బర్త్ డే పాటను పాడటం కూడా ఉంది.
హత్యాయత్నం సహా పలు కేసుల్లో డానిష్ షేక్ నేరస్థుడిగా ఉన్నాడు. గతంలో జోగేశ్వర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. యూనిఫామ్‌లో నేరస్థుడికి పోలీస్ అధికారి కేక్ తినిపించడం పట్ల విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన ఉన్నతాధికారులు..విచారణకు ఆదేశించారు. దీనిపై పోలీస్ అధికారి మహేంద్ర నెర్లేకర్ వివరణ ఇచ్చారు. ఇది పాత వీడియో అని హౌసింగ్ సొసైటీలో కూల్చివేత పనులు జరుగుతుండగా..పర్యవేక్షణకు వెళ్లిన సందర్భంలోనిదని సర్ధిచెప్పుకొచ్చారు.
హౌసింగ్ సొసైటీలో కూల్చివేత పనులు జరుగుతుండగా..అక్కడే ఉన్న కొందరు సీనియర్ సిటిజన్లు సొసైటీ కార్యాలయాన్ని సందర్శనకు రావాలని తనను పట్టుబట్టారని..పెద్దవారి మాటలను గౌరవించాలని వారి మాటను కాదనలేక అక్కడకు వెళ్లానని..కానీ డానిష్ అక్కడ ఉన్న విషయం తనకు తెలియదని వివరణ ఇచ్చుకున్నారు. అలా తను అక్కడకు వెళ్లిన తరువాత తనతో కేక్ కట్ చేయించారని..ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి తినిపించానని వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని..సకినాక డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని 10వ జోన్ డీసీపీ మహేశ్ రెడ్డి తెలిపారు.