Mumbai Police
Mumbai Police : ఫ్రెండ్ షిప్ డే రోజు ముంబయి పోలీసులు చేసిన ట్వీట్ అందరి మనసులు దోచుకుంది. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇస్తూ ట్విట్టర్‌లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
Seema Haider : సీమాహైదర్ ప్రేమ కథలో ముంబయి పోలీసులకు మరో హెచ్చరిక
అందరి జీవితాల్లో స్నేహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్నేహితులు మన తోడుగా ఉండటమే కాదు మన జీవితంలో సంతోషాన్ని పంచుతారు. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఆగస్టు 6 ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇంటర్నెట్‌లో ఎన్నో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాటిలో ముంబయి పోలీసులు చేసిన ట్వీట్ అందరి మనసుల్ని గెలుచుకుంది.
ముంబయి పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో (@MumbaiPolice) ‘ఏ సమస్య ఉన్నా లేదా ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, మీరు ఎల్లప్పుడూ మీ స్నేహితుడిపై ఆధారపడవచ్చు’ అనే శీర్షికతో పాటు ”ఆల్వేస్ దేర్ ఫర్ యు” అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా, అసురక్షితంగా భావించినా, ఏదైనా కష్టంలో ఉన్నా వెంటనే సాయం చేస్తామంటూ ముంబయి పోలీసులు ట్వీట్ ద్వారా హామీ ఇచ్చారు. నెటిజన్లు ముంబయి పోలీసులకు ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వారికి కృతజ్ఞతలు చెప్పారు.
No matter what the problem is or how difficult the situation is, you can always count on this friend of yours!
#FriendshipDay #AlwaysThereForYou pic.twitter.com/yKu91dz3G3— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) August 6, 2023