Omicron Third Wave India May Hit 8 Lakh Daily Covid Infections By End Of January, Suggests Sutra Model
Covid Cases: ఒక్క ముంబైలో గడిచిన 24గంటల్లో 20వేల 318 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన 20వేల 971కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ శనివారం 5మృతులు సంభవించాయని రికార్డులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు 41వేల 434గా ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 13మంది ప్రాణాలు కోల్పోయారు. నమోదవుతున్న కేసుల్లో 82శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కొవిడ్ కారణంగా వెయ్యి 257మంది పేషెంట్లు హాస్పిటల్ లో అడ్మిట్ అవగా 108మందికి ఆక్సిజన్ సపోర్ట్ కావాల్సి వచ్చింది.
దీంతో ప్రస్తుతం సిటీలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 33వేల 803హాస్పిటల్ బెడ్స్ ఉన్న సిటీలో 21.4శాతం బెడ్స్ అంటే 7వేల 234బెడ్లకు అడ్మిట్ అయ్యారు.
ఇది కూడా చదవండి : 68 మంది సీబీఐ సిబ్బందికి కరోనా
ఇదిలా ఉంటే 6వేల 3మంది రికవరీ అయి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేట్ ప్రస్తుతం 86శాతంగా ఉంది.