Indigo Airlines : ఇండిగో విమానంలో రక్తపు వాంతులతో చనిపోయిన ప్రయాణీకుడు

గాల్లోనే ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఏ పనిమీద వెళుతుండగా అనుకోకుండా గాల్లో అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. అలా మృత్యువు ఏసమయంలో ఎవరిని ఎలా కబళిస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో సడెన్ గా గాల్లోనే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.

Mumbai- Ranchi Indigo Airlines

Mumbai- Ranchi Indigo Airlines : ముంబై నుంచి రాంచీకి వెళుతున్న ఇండిగో విమానంలో ఓవ్యక్తి రక్తం కక్కుకుని మరణించాడు. సోమవారం (ఆగస్టు 21,2023) ఓ ప్రయాణీకుడికి హఠాత్తుగా రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని నాగ్ పూర్ లో ల్యాండ్ చేశారు. వెంటనే సదరు వ్యక్తిని నాగ్ పూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలిచంగా అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

62 వ్యక్తి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా సడెన్ గా అవస్వతస్థకు గురి అయ్యారు. సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో సతమతమవుతున్న సదరు ప్రయాణికుడు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు. దీంతో.. పైలట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో దించగానే బాధితుడిని హుటాహుటీన కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. కిమ్స్ ఆసుపత్రి బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ డీజీఎం ఎజాష్ షామీ వెల్లడించారు.