Muslim Cleric: మోహన్ భగవత్‌ను పొగిడిన ముస్లిం మత గురువుకు బెదిరింపులు.. చంపుతామంటూ వార్నింగ్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ‘జాతి పిత’గా అభివర్ణించాడు ఒక ముస్లిం మత గురువు. ఇదే ఆయనకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. మోహన్ భగవత్‌ను పొగిడినందుకుగానూ, ఆ మత గురువును చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.
- Narender Thiru
- Published On : September 30, 2022 / 06:06 PM IST
Muslim Cleric: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ముస్లిం మత గురువు, అఖిల భారత ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇల్యాసి ఇటీవల ‘జాతి పిత’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. మోహన్ భగవత్ గతవారం ఢిల్లీలోని ఒక మసీదు, మదర్సాను సందర్శించిన సందర్భంగా ఇల్యాసి ఈ వ్యాఖ్యలు చేశారు.
Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు
అయితే, ఇల్యాసి ఇలా మోహన్ భగవత్‌ను పొగిడినందుకుగాను ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఇల్యాసి చెప్పారు. తనను చంపుతామని బెదిరిస్తూ, అంతర్జాతీయ నెంబర్ల నుంచి వరుసగా కాల్స్ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 22న మోహన్ భగవత్ మదర్సాను సందర్శించారు. ముస్లిం ప్రముఖులతో ఆయన కొంతకాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముస్లిం సమాజంలో ఆర్ఎస్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను తొలగిండచడంతోపాటు, దేశంలో శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా పలువురు ముస్లిం నేతలను మోహన భగవత్ కలుస్తున్నారు.
Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్
తన ఆహ్వానం మేరకే మోహన భగవత్ మదర్సా, మసీదును సందర్శించినట్లు ఇల్యాసి చెప్పారు. మదర్సాను సందర్శించినప్పుడు అక్కడి విద్యార్థులతో మోహన్ భగవత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు ‘జై హింద్’, ‘వందేమాతరం’ వంటి నినాదాలు చేశారు. ఈ సందర్భంగానే ఇల్యాసి.. మోహన భగవత్ గురించి వ్యాఖ్యానించారు.
