Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్

పదో తరగతి విద్యార్థిని అతడి స్నేహితులే పొడిచి చంపారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్కూల్లో తమతో గొడవ పడ్డందుకు, క్లాస్‌మేట్స్ ఈ దారుణానికి తెగించారు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.

Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్

Updated On : September 30, 2022 / 4:53 PM IST

Delhi Shocker: ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక స్కూల్లో తమతో గొడవపడ్డ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు అతడి క్లాస్‌మేట్స్. ఈ ఘటన ఢిల్లీ, ఆదర్శ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం మధ్యాహ్నం జరిగింది.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బురారి ప్రాంతానికి చెందిన దీపాన్షు అనే విద్యార్థి స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడికి, ఐదుగురు క్లాస్‌మేట్స్‌కు గొడవ జరిగింది. ఈ ఘటనతో దీపాన్షుపై కోపం తెచ్చుకున్న ఐదుగురు విద్యార్థులు అతడిని చంపాలనుకున్నారు. స్కూల్ ముగిసి ఇంటికి వెళ్తున్న సయమంలో దీపాన్షుపై ఐదుగురు కలిసి బటన్ చాకుతో దాడి చేశారు. శరీరంలో పలు చోట్ల తీవ్రంగా పొడిచారు. ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు, పాఠశాల సిబ్బంది కలిసి గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

Afghanistan Blast: క్లాస్‌రూమ్‌లో పరీక్ష రాస్తుండగా ఆత్మాహుతి దాడి.. వంది మంది విద్యార్థులు మృతి

కానీ, దీపాన్షు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి బటన్ చాకును స్వాధీనం చేసుకున్నారు. ఆ చాకును వారు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు తెలిసింది. నిందితులు మైనర్లు కావడంతో పోలీసులు వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.