Maharashtra : బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో.. వ్యక్తిని కొట్టి చంపిన గోసంరక్షకులు

నాసిక్ జిల్లా దగ్గరకు రాగానే కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించారు. ఆపై కారులోని ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరార్ అయ్యారు.

Muslim man death

Muslim Man Death : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దారుణం జరిగింది. బీఫ్ మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని గోసంరక్షకులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై కర్లా ప్రాంతానికి చెందిన అన్సారీ(32) తన స్నేహితుడు నాసిర్ షేక్ తో కలిసి కారులో మాంసాన్ని తీసుకెళ్తున్నాడు.

ఈ నేపథ్యంలో నాసిక్ జిల్లా దగ్గరకు రాగానే కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించారు. ఆపై కారులోని ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి అక్కడ నుంచి పరార్ అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.

Delhi Robbery : ఢిల్లీలో పట్టపగలే దోపిడీ .. కారులో ఉన్నవారికి గన్ చూపించి క్యాష్‌బ్యాగ్‌తో పరార్

ఘటనాస్థాలానికి వెళ్లి చూడగా కారు ధ్వంసమై కనిపించిందని ఎస్ ఐ సునీల్ భామ్రే పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో కారులో ఉన్న ఇద్దరినీ చికిత్స కోసం హుటాహుటినా స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అన్సారీ అనే వ్యక్తి మృతి చెందారని పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన మరో వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అయితే వారు తరలిస్తున్న మాంసం బీఫా? కాదా? అనేది ల్యాబ్ పరీక్షల అనంతరం తెలుస్తుందని పేర్కొన్నారు.