Uttar Pradesh : హిందూ యువతిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు.. అతని తల్లిదండ్రులు దారుణ హత్య

ఇంట్లో ఉన్న అతని తల్లిదండ్రులు అబ్బాస్, కమ్రూల్ నిషాలపై ఇనుప రాడ్ లు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Muslim Couple Kill

Uttar Pradesh Muslim Couple Kill : ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో ఘోరం జరిగింది. ముస్లిం దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హిందూ బాలికను ముస్లిం బాలుడు తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడంతో అతని తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశారు. సీతాపూర్ లో అబ్బాస్, కమ్రూలూ నిషా దంపతులు కుమారుడు షౌకత్ తో కలిసి నివాసముంటున్నారు. వీరి ఇంటి పక్కనే రాంపాల్ కుటుంబం ఉంటున్నారు. రాంపాల్ కు రూబీ అనే కూతురు ఉంది.

ఈ నేపథ్యంలో షౌకత్, రూబీ కుటుంబాలు పక్కపక్కనే ఉండటంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయం రూబీ తల్లిదండ్రులు తెలిసింది. రూబీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో షౌకత్, రూబీ లేచిపోయారు.
దీనిపై రూబీ తండ్రి రాంపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Supari Audio Tape : మంథనిలో సుపారీ ఆడియో టేప్ కలకలం.. బీజేపీ, కాంగ్రెస్ నేతలను చంపేందుకు సుపారీ ఇచ్చారంటూ చెప్పిన అజ్ఞాత వ్యక్తి

అప్పటికీ రూబీ మైనర్ కావడంతో పోలీసులు షౌకత్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఇటీవలే షౌకత్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు రూబీ మేజర్ కావడంతో ఆమెను మరోసారి తీసుకెళ్లి షౌకత్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రూబీ కుటుంబసభ్యులు ఆగ్రహించారు. రూబీ తండ్రిరాంపాల్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి షౌకత్ ఇంటిపై దాడి చేశారు.

ఇంట్లో ఉన్న అతని తల్లిదండ్రులు అబ్బాస్, కమ్రూల్ నిషాలపై ఇనుప రాడ్ లు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రూబీ తండ్రి రాంపాల్ తోపాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.