Supari Audio Tape : మంథనిలో సుపారీ ఆడియో టేప్ కలకలం.. బీజేపీ, కాంగ్రెస్ నేతలను చంపేందుకు సుపారీ ఇచ్చారంటూ చెప్పిన అజ్ఞాత వ్యక్తి
తాను అంగీకరించకపోవడంతో తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. వారి నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణ హానీ ఉందన్నారు.

Manthani Supari Audio Tape
Manthani Supari Audio Tape : పెద్దపల్లి జిల్లా మంథనిలో సుపారీ ఆడియో టేప్ కలకలం రేపుతోంది. బీజేపీ నేత సునీల్ రెడ్డి, కాంగ్రెస్ నేత సతీష్ ను చంపేందుకు తనకు జెడ్పీ చైర్మన్ పుట్ట మధు సుపారీ ఇచ్చారంటూ ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పిన మాటలు మంథనిలో కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బీజేపీ మండల అధ్యక్షుడు రాజేందర్ కు ఆడియో వెళ్లింది. సోషల్ మీడియాలో ఆడియో టేప్ వైరల్ కావడంతో రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడ్వకేట్ వామన్ రావు హత్యకు తనకు సుపారీ ఇచ్చి పథకం రచించింది జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, పుట్టా శైలజ అని చెప్పారు. వారు తనకు ఐదు కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి వారిని చంపడానికి తనతో పథకం రచించారని తెలిపారు. అప్పుడు రెండు కోట్ల రూపాలయులు తనకు ముందుగా చెల్లించారని, మిగిలిన డబ్బులు పని అయిపోయాక ఇస్తామన్నారని తెలిపారు. తర్వాత తాను వెళ్లి అడిగితే వారు ఆ డబ్బులను నిరాకరించి తనకు వేరే పని ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు.
Madanlal : మహిళతో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్
ఆ పని అప్పుడు ఈ డబ్బులు, ఆ డబ్బులు కలిపి ఇస్తామని చెప్పారని తెలిపారు. ఇప్పుడు మరో పని నిమిత్తం రూ.12 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. మంథనీ బీజేపీ నేత చందుపట్ల సునీల్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకుడు సునీల్ రెడ్డిలను రోడ్డు యాక్సిడెంట్ లో తీసేసి ఆ మూడు కోట్ల రూపాయలు, ఈ 12 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 15 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి తనకు చర్చలు జరిపారని తెలిపారు.
దీనికి తాను అంగీకరించకపోవడంతో తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. వారి నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణ హానీ ఉందన్నారు. కావున తెలంగాణ సమాజం, మంథనీ ప్రజలు ఇది గమనించగలరని మనవి చేశారు.