ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిలా మటోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.బుధవారం(మార్చి-27,2019)ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.తన కుటుంబం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఫాలో అయ్యేదని,వారి అడుగుజాడల్లో నడిచి తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఈ సందర్భంగా ఊర్మిలా తెలిపింది.
చాలా ఏళ్లుగా ఊర్మిలా తనకు తెలుసునని,ఆమె దేశంలో అతికొద్దిమంది గొప్ప ఆర్టిస్ట్ లలో ఒకరు మాత్రమే కాకుండా ఆమె సమాజంలో జరగుతున్న పరిణామాల పట్ల తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేదని, కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశానికి సేవ చేయవచ్చని నమ్మి ఆమె తమ పార్టీలో చేరారని ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా తెలిపారు.ఏప్రిల్ నెలలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం.
Read Also : నాటకాల రోజుకి హ్యాపీ డే : మోడీ మిషన్ శక్తి ప్రకటనపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు