నాగ్‌పూర్ యువతి అత్యాచారం: నోట్లో గుడ్డలు కుక్కి..ఐరన్ రాడ్‌తో పైశాచిక హింస

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 10:02 AM IST
నాగ్‌పూర్ యువతి అత్యాచారం: నోట్లో గుడ్డలు కుక్కి..ఐరన్ రాడ్‌తో పైశాచిక హింస

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గత వారం 19 ఏళ్ల యువతిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో దారుణమైన వాస్తవాలను పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని ఇనుప రాడ్ తో దారుణంగా హింసించాడనీ..ఆమె ప్రయివేటు అవయవాల్లో ఇనుప రాడ్ తో దారుణంగా హింసించారని తెలిపారు. గత మంగళవారం (జనవరి 21,2020) ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశామని నాగ్ పూర్ పోలీసులు తెలిపారు. 

ఈ  కేసు విషయంలో ఇన్స్పెక్టర్ సునీల్ చవాన్ మాట్లాడుతూ..నిందితుడు యోగిలాల్ రహంగ్‌డేల్ (52) స్పిన్నింగ్ మిల్లులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు తన సోదరుడు, సదరు నిందితుడు, మరో మహిళతో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. ఆమె సోదరుడు..ఓ పనిమీద తమ గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై రాహంగ్‌డేల్ అత్యాచారం చేయడానికి యత్నించగా..ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన పశువుగా మారిన రహంగ్ డేల్ ఆమె నోటిలో ఒక గుడ్డలు కుక్కి దారుణంగా కొట్టాడు. 

దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అటువంటి స్థితిలో ఉన్న  ఆమెపై రహంగ్ డేల్ అత్యాచారం చేసి..ఆమె ప్రైవేట్ భాగాలలో ఇనుప కడ్డీని చొప్పించి దారుణంగా హింసించాడని తెలిపారు. అలా మూడు రోజుల తరువాత శుక్రవారం (జనవరి 24)న ఇంటికి వచ్చిన ఆమె తన సోదరుడికి తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పింది. దీంతో ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని రహంగ్ డేల్ ను అరెస్ట్ చేశామని  తెలిపారు.