Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఇంటి బాల్కనీలోపలి నుంచి ఫ్లైఓవర్.. రూ.998 కోట్లు ఖర్చు చేసి కట్టారు.. వీడియో

ఈ ఫ్లైఓవర్‌ మెయిన్ రోడ్డు జంక్షన్ వద్దే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తున్న వారు బాల్కానీలో ఫ్లై ఓవర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Viral Video

Viral Video: ఇంట్లో గాలి ఆడకపోతే కాసేపు బాల్కనీలోకి వస్తాం. అయితే, బాల్కానీ ఉన్నప్పటికీ అందులోకి వచ్చే అవకాశం లేకుండా పోతోంది ఓ కుటుంబానికి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఏకంగా రూ.998 కోట్లు ఖర్చు చేసి ఇన్‌దోరా-దిఘోరి ఫ్లైఓవర్ కట్టారు.

ఈ ప్రాజెక్టులో కమల్ చౌక్ నుంచి రేశింబాఘ్ స్క్వేర్ వరకు, భండే ప్లాట్ స్క్వేర్ నుంచి దిఘోరి వరకు రెండు పెద్ద ఫ్లైఓవర్లు ఉన్నాయి. అశోక్ స్క్వేర్ వద్ద శ్రుష్టి పత్రే అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. వారి బాల్కనీ గుండా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు.

Bigg Boss Telugu Offer: బిగ్ బాస్ హౌస్‌లోకి తాను, మాధురి ఎందుకు వెళ్లలేదో చెప్పేసిన దువ్వాడ శ్రీనివాస్

శ్రుష్టి పత్రే మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఫ్లైఓవర్‌ను తమ బాల్కనీలోకి వచ్చేలా నిర్మించడంతో తమకు కొద్దిపాటి అసౌకర్యం కలుగుతున్నప్పటికీ, తాము ఏమీ చేయలేమని చెప్పారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అని అన్నారు.

ఇలా నిర్మిస్తున్నామని ముందుగా సమాచారం ఇచ్చారా? అని అడిగితే.. కొన్ని నెలల క్రితమే నోటీసు ఇచ్చారని శ్రుష్టి తెలిపారు. కానీ, ఎటువంటి పరిహారం రాలేదని అన్నారు. (Viral Video)

ఫ్లైఓవర్‌ను బాల్కానీ మీదుగా ఎందుకు నిర్మించారని స్థానిక మీడియా నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీసీఎల్)ను అడగాలనుకుంది. కానీ, దాని ప్రతినిధులు అందుబాటులో లేరు.

ఈ ఫ్లైఓవర్‌ మెయిన్ రోడ్డు జంక్షన్ వద్దే ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తున్న వారు బాల్కానీలో ఫ్లై ఓవర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.