ప్రియుడి పెళ్లిలో..ప్రియురాలు రచ్చ..భార్య జుట్టు కత్తిరించి కళ్లను ఫెవిస్టిక్ తో అతికించేసి చావబాదేసింది

  • Publish Date - December 3, 2020 / 09:11 AM IST

Bihar : Nalanda girl friend attack bride cut hair : ప్రేమించానని చెప్పి నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటికొచ్చి ప్రియురాలు రచ్చ రచ్చ చేసింది. నానా యాగీ చేసింది. ప్రియుడి భార్యను చావబాదేసింది. అక్కడితో ఊరుకోకుండా శివంగిలా రెచ్చిపోయి ఆమె జుట్టు కత్తించేసి..ఆమె కళ్లను ఏకండా ఫెవిస్టిక్ తో అతికించేసింది. బీహార్ లోని నలందాలో జరిగిన ఈ ఘటనతో పాపం..పెళ్లికూతురి పరిస్థితి వర్ణనాతీంగా మారింది. ఆమె గుండె దడదడలాడిపోయింది. ఈ ఘటన స్థానికంగా షాక్ కు గురిచేసింది. దీంతో సదరు ప్రియురాలిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.



వివరాల్లోకి వెళితే..బీహార్‌లోని నలందా జిల్లాలోని బిఘా థానా ప్రాంతంలోని మోరా తాలాబ్ గ్రామంలో గోపాల్ రామ్ అనే యువకుడికి బుధవారం (డిసెంబర్ 2,2020) వివాహం జరిగింది. షేక్‌పురా జిల్లాకు చెందిన యువతిని గోపాల్ రామ్ వివాహం చేసుకున్నాడు. పెళ్లంతా సందడి సందడిగా జరిగింది. అనంతరం నూతన దంపతులు పెళ్లికొడుకు ఇంటికి చేరుకున్నారు. పెళ్లిలో అలసిపోవటంతో నూతన దంపతులు నిద్రపోతున్నారు. అదే సమయంలో ఓ యువతి గోపాల్ రామ్ ఇంటిలోకి దూసుకొచ్చింది.



అలా వచ్చీ రావటంతోనే ఇల్లంతా కలియతిరిగింది. ఓ రూమ్ లో మంచంపై నిద్రపోతున్న కొత్త పెళ్లికూతురిపై దాడి ప్రారంభించింది. నిద్రలో ఉన్న ఆమె తేరుకునేలోపే ఇష్టమొచ్చినట్లుగా కొట్టింది. దీంతో ఆమె అయోమయంలో ఆందోళనలో పడిపోయింది. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని అయోమంలో పడి తేరుకునే లోపే సదరు యువతి ఓ కత్తెరతో ఆమె జుట్టు కట్ చేసి పారేసింది. అంతటితో ఊరుకోకుండా ఆమె కళ్లను ఏకంగా ఫెవిస్టిక్ తో అతికించే ఇష్టమొచ్చినట్లుగా చావబాదేసింది.



తనపై ఎవరి దాడి చేస్తున్నారో కూడా తెలియని ఆందోళనలో ఉన్న ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడి చేరుకున్న భర్త..అత్తింటివారు సదరు యవతిని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడిందామె. నన్ను మోసం చేసి వేరేదాన్ని పెళ్లి చేసుకుంటావా? నన్ను మోసం చేసి నువ్వెలా సుఖంగా ఉంటావో చూస్తానంటూ రంకెలు వేసింది. దీంతో పోలీసులకు ఫోన్ చేయటంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.



ఈ ఘటనపై డీఎస్సీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..గోపాల్ రామ్ అనే యువకుడు దాడికి పాల్పడిన యువతిని గతంలో ప్రేమించాడని..ఆమె గోపాల్ రామ్ చెల్లెలికి స్నేహితురాలని తెలిపారు. అలా పరిచయం అయిన ఆమెతో కొంతకాలం ప్రేమించాడనీ..తరువాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం సదరు యువతి భరించలేక గోపాల్ రామ్ భార్యపై దాడికి పాల్పడిందని తెలిపారు.



ఆమె ఇంటికి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదనీ..పెళ్లిలో అలసిపోయిన అందరూ నిద్రపోతున్న సమయంలో కొత్త పెళ్లికూతురిపై ఇలా దాడికి పాల్పడి..ఆమె జుట్టు కత్తిరించి కళ్లను ఫెవిస్టిక్ తో అతికించేసిందని తెలిపారు. సదరు కొత్త పెళ్లి కూతురిని షరీఫ్ సదర్ హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా..ముందస్తు జాగ్రత్తగా మోరా తాలాబ్ గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.