Bjp
Sikha Mitra : ఎన్నికల సందర్భంలో తమకు టికెట్ కేటాయంచాలని కొందరు పట్టుబడుతుంటారు. టికెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తమకు టికెట్ కేటాయించ లేదని అలకబూని..ఆ పార్టీకి రాజీనామా చేయడమో..ఇతర పార్టీల్లోకి జంప్ అవుతుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా..తనను సంప్రదించకుండానే..పేరును ప్రకటించడం..జాబితాలో పేరు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ మహిళ.
పశ్చిమ బెంగాల్. ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనబడుతోంది. పాగా వేయాలని బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. మమతకు చెక్ పెట్టాలని వ్యూహాత్మంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సినిమా నటులు, ఇతర రంగాలకు చెందిన వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. టీఎంసీకి చెందిన పలువురు బీజేపీలోకి జంప్ అయ్యారు కూడా.
ఇప్పటికే ఒక జాబితా విడుదల చేసిన ఆ పార్టీ..రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో దివంగత కాంగ్రెస్ నాయకుడు సోమెన్ మిత్ర భార్య సిఖ మిత్ర పేరు ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే..చౌరింఘీ నియోజకవర్గ అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని. తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని తేల్చిచెప్పారు. బీజేపీలో జాయిన్ అవ్వటం లేదని ఘంటాపథంగా చెప్పారామె. వారిని అడగకుండానే..పేరును ప్రకటించడంపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.